Vanavasi Parishad’s Goal: Village Development
గ్రామ వికాసమే వనవాసీ లక్ష్యం
వనవాసీ ప్రాంత మహిళా సహ ప్రముఖ్ ఆశాలత
నేటిదాత్రి చర్ల
గ్రామ వికాసమే వనవాసీ కళ్యాణ పరిషత్ లక్ష్యమని సంస్ద ప్రాంత మహిళా సహప్రముఖ్ పెద్దాడ ఆశాలత అన్నారు చర్ల మండలంలోని గొంపల్లి మండల పరిషత్ ప్రాదమికోన్నత పాఠశాల ఉపాద్యాయుడు నిజాంపట్నం మనోహర్ అనిత దంపతుల కుమారుడు షష్ముక్ శ్రీజయ్ ద్వితీయ జన్మదినం సందర్భంగా వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్ది నిలయ విద్యార్దులకు భోజన ఏర్పాట్లు చేసారు ఈ సందర్భంగా నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్నకుమారి అద్యక్షతన జరిగిన సమావేశంలో ఆశాలత మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల అభ్యున్నతి కొరకు మన భారతదేశంలో 254 వనవాసీ కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇక్కడ విద్యార్దులకు వినయ విదేయతతో పాటు క్రమశిక్షణ నేర్పుతామని పేర్కొన్నారు తమ సంస్ద ద్వారా గ్రామాలలో వైద్యశిభిరాలతో పాటు కూరగాయల విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు

తెలిపారు విద్యార్దులకు వినయ విదేయత నేర్పడంతో పాటు వారిని సంస్కరించడం కొరకు కృషి చేస్తున్నట్లు తెలిపారు వనవాసీ ద్వారా 3 వ తరగతి నుండి డిగ్రీ పిజి చదువులతో పాటు ఇతర టెక్నికల్ కోర్సులను గిరిజన విద్యార్దులకు అందిస్తున్నామని వెల్లడించారు ఇటువంటి అవకాశాలను సద్వినియోగ పరుచుకొని అనేకమంది డాక్టర్స్ ఇంజనీర్లు సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా స్దిరపడ్డారని అన్నారు ప్రతి విద్యార్ది ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని జీవితంలో స్దిరపడాలని ఆకాంక్షించారు ఉపాద్యాయుడు మనోహర్ మాట్లాడుతూ మారుమూల గ్రామాల నుండి వచ్చి ఇక్కడ విద్యాబుద్ధులు నేర్చుకోవడం అబినందనీయమని అన్నారు తాను ఒక ఉపాద్యాయుడిగా ఇక్కడి విద్యార్దుల క్రమశిక్షణకు ఆకర్షితుడినయినట్లు పేర్కొన్నారు విద్యార్దులంతా మంచిగా చదివి విద్యావంతులుగా ఎదిగి ఉద్యోగం సాదించడం ద్వారా జీవితంలో స్దిరపడాలని సూచించారు వనవాసీ నిలయ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవాగుణం కలిగి ఉండాలని పేర్కొన్నారు ఎదుటి వారి నుండి మనం లబ్దిపొందినపుడు మనం కూడా ఎంతో కొంత సహాయం అందించాలనే గుణం అలవర్చుకోవాలని విజ్ఞప్తి చేసారు ప్రతి విద్యార్ది చిన్ననాటి నుండే ఇతరులు చేస్తున్న సేవా కార్యక్రమాలను గమనించి ఉన్నత స్దితికి చేరుకున్న అనంతరం అదే విదంగా ఇతరులకు సహాయం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గొంపల్లి ప్రాదమికోన్నత పాఠశాల ఉపాద్యాయుడు శంకర్ రావు రమణ పాల్గొన్నారు
