
“Vijetha Supermarket” launched in Shankarpally
శంకర్పల్లిలో “విజేత సూపర్ మార్కెట్” ప్రారంభం
చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం

శంకర్పల్లి, నేటిధాత్రి :
“విజేత సూపర్ మార్కెట్ ” తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు అంత ప్రఖ్యాతి పొందింది. అలాంటిది మన శంకర్పల్లి పట్టణంలోని వాణిజ్య రంగానికి కొత్త ఒరవడి తీసుకువచ్చే లక్ష్యంతో ఏర్పాటు చేసిన “విజేత సూపర్ మార్కెట్” గురువారం చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.
ప్రారంభోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ “ప్రజలకు నిత్యవసర వస్తువులు, ఆహార పదార్థాలు, ఇతర వినియోగ సామగ్రి నాణ్యతతోపాటు సరసమైన ధరలకూ అందుబాటులో ఉండేలా ఈ సూపర్ మార్కెట్ ఏర్పాటు చేయడం అభినందనీయం,” అని పేర్కొన్నారు.
స్థానిక యువత ఉద్యోగ అవకాశాలు పొందడంలో ఈ మార్కెట్ దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
అలాగే
విజేత సూపర్ మార్కెట్ యజమానులు మాట్లాడుతూ,
“ప్రజలకు అత్యుత్తమ సేవలందించాలన్నదే మా ముఖ్య లక్ష్యం. నిత్యం తక్కువ ధరలకు అధిక నాణ్యత కలిగిన వస్తువులను అందుబాటులో ఉంచుతాము. కస్టమర్ల విశ్వాసమే మా శక్తి” అని తెలిపారు.
సూపర్ మార్కెట్లో నిత్యవసర వస్తువులు, కూరగాయలు, పండ్లు, ప్యాకెజ్డ్ ఫుడ్, గృహోపయోగ వస్తువులు, మరియు ఇతర డైలీ నీడ్ ఉత్పత్తులు సమృద్ధిగా లభించనున్నాయి అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు, వ్యాపారవేత్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
పట్టణ అభివృద్ధిలో భాగంగా శంకర్పల్లిలో ఇటువంటి సదుపాయాలు ఏర్పడటం సంతోషకరమని స్థానికులు పేర్కొన్నారు.