@జనసంద్రోహంగా మారిన చింత నెక్కొండ.
@ నర్సంపేట ప్రజల నోటిలో నాలుకలా..
@కడసారి వీడ్కోలు పలికిన బాల్యమిత్రులు, కుటుంబ సభ్యులు ,పోలీస్ ఉన్నత అధికారులు.
వరంగల్ / పర్వతగిరి,నేటిధాత్రి :
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న దబ్బట విజేందర్ శుక్రవారం రాత్రి ఒంటిగంట సమయంలో వరంగల్ నుండి తొర్రూరుకు బైక్ పై వస్తుండగా మార్గం మద్యలో మామునూరు సమీపంలో ప్రమాదానికి గురై మృతు ఒడిలోకి జారుకున్నాడు. వివరాల్లోకి వెళితే వరంగల్ నుండి తొర్రూర్ కు బైక్ పై వస్తున్న విజేందర్ గుర్తుతెలియని వాహనం ఢీకొని మామునూరు సమీపంలో గాయాలపాలు అయ్యాడని విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తొర్రూరు ఎస్సై మరియు ఉన్నత అధికారులు వెంటనే స్పందించి విజేందర్ ను మెరుగైన వైద్యం కోసం హనుమకొండ లోని మెడికవర్ హాస్పిటల్ కు తరలించగా అప్పటికే విజేందర్ మృతి చెందాడని వైద్యులు తెలపగా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు.
శోకసముద్రంలో మునిగిన చింత నెక్కొండ.
విజేందర్ ఇక లేడు అనే వార్తను చింత నెక్కొండ గ్రామస్తులు జీర్ణించుకోలేకపోయారు చిన్ననాటి నుండి గ్రామస్తులతో పంచుకున్న ప్రేమ అనురాగాలు చిన్ననాటి స్నేహితుల ఆప్యాయతల నడుమ విజేందర్ అంతక్రియలు శోక సముద్రంలో కొనసాగాయి. అంతేకాక పక్క మండలమైన నెక్కొండ లోని చిన్ననాటి స్నేహితుల కన్నీటి జాలల మధ్య విజేందర్ పై ఉన్న ప్రేమ అనురాగాలతో కంటినీరు వరదయ్య పారింది. చింత నెక్కొండ లోని గల్లి గల్లి కి విజేందర్ అమరహే అనే నినాదాలు మిన్నంటాయి. విజేందర్ కడసారి చూపు కోసం నర్సంపేట, నెక్కొండ, తొర్రూర్ ప్రజల కన్నీటితో విజేందర్ అంతక్రియలు చింత నెక్కొండ స్మశాన వాటికలో శుక్రవారం రాత్రి ముగిసాయి.
అంతిమయాత్రలో పాల్గొన్న పోలీస్ ఉన్నతాధికారులు.
కానిస్టేబుల్ విజేందర్ అంతిమయాత్రలో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని విజేందర్ మృతదేహంపై పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
నర్సంపేట ప్రజల నోటిలో నాలుకలా..
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ పోలీస్ స్టేషన్ లో సుదీర్ఘ 9 సంవత్సరాల పాటు విధులు నిర్వర్తించిన కానిస్టేబుల్ విజేందర్ ప్రజల నోట్ల నాలుకలా అయ్యాడు.అందరినీ ఆప్యాయంగా పరికరించే కానిస్టేబుల్ ప్రమాదంలో మరణించాడనే సమాచారంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.తనతో కలిసి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ నివాళులు అర్పించారు.