విజయసాయిరెడ్డి బాటలో మరికొందరు

వైఎస్సార్సీపీపై విజయసాయిరెడ్డి ‘పిడుగు’!

అంతా బాగుందనుకున్న తరుణంలో అనుకోని దెబ్బ

ఈ ఖాళీ రాజ్యసభ స్థానాలపై బీజేపీ కన్ను

చంద్రబాబుకు ‘తృప్తి’ తప్ప ‘సీట్ల లాభం’ లేదు

జగన్‌ వైఖరి మారాలేమో?

ప్రాంతీయ పార్టీల్లో పరిణామాలు దాదాపు ఒకేమాదిరిగా వుండటం కద్దు. నాడు ఎన్టీఆర్‌ అమెరికాలో ఉన్నప్పుడు, నాదెండ్ల భాస్కర్‌రావు అధికారాన్ని చేజిక్కించుకుంటే, నేడు వై.ఎస్‌. జగన్‌ విదేశాల్లో ఉన్నప్పుడు పార్టీకి అత్యంత ముఖ్యుడు, నెంబర్‌`2గా పరిగణించే విజయసాయిరెడ్డి రాజీ నామా శరాఘాతం వంటిదేనని చెప్పాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై విరుచుకుపడే ఛాన్స్‌ వస్తున్నదనుకుంటున్న తరుణంలో వై.ఎస్‌.ఆర్‌.సి.కి పెద్ద షాక్‌! వై.ఎస్‌. జగన్‌ కుటుంబానికి ఎంతో నమ్మకస్తుడు, వై.ఎస్‌.రాజారెడ్డి కాలంనుంచి ఆ కుటుంబానికి ఆడిటర్‌గా వున్న విజయసాయిరెడ్డి వై.ఎస్‌.ఆర్‌.సి.పి. పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం ఆంధ్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం! అయితే పార్టీలో అంతర్గతంగా ఆయన రాజీనామా చేస్తారన్న విషయం ముందే తెలిసుండవచ్చు. విచిత్రమేమంటే ఆయన రాజీనామాపై విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. మొదటిది వైఎస్‌ఆర్సీపీకి అన్ని సందర్భాల్లో కొండంత అండగా నిలుస్తున్న విజయసాయిరెడ్డిని ఏదోవిధంగా పార్టీనుంచి బయటకు వచ్చేలా చేస్తే, జగన్‌ను బల హీన పరచవచ్చునన్న ఉద్దేశంతో ప్రత్యర్థి నేతలు మంత్రాంగం నడిపారన్నది ఈ కథనం సారాంశం. ముఖ్యంగా జగన్‌పై ఉన్న కేసులకు సంబంధించి గతంలో విజయసాయిరెడ్డి కూడా జైలుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ కేసులకు సంబంధించి ఆయన్ను అప్రూవర్‌గా మారేవిధంగా ఒప్పించి ఏదో ఒక రాజకీయ ప్రయోజనం కల్పించాలని చేసిన యత్నాలు బెడిసికొట్టాయని వార్తలు వచ్చాయి. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించిన తర్వాత విజయసాయిరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ తనకు వెన్నుపోటు రాజకీయాలు తెలియవని, తనను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా అప్రూ వర్‌గా మారలేదంటూ కీలకమైన వ్యాఖ్యలు చేయడం ఈ కథనానికి బలం చేకూరుస్తున్నది. వై.ఎస్‌. జగన్‌ మళ్లీ బలపడుతున్న నేపథ్యంలో ఆయన్ను పూర్తిగా రాజకీయంగా దె బ్బకొట్టాలన్న ఉద్దేశంతో జరిపిన ఈ మంత్రాంగం ఫలించకపోవడంతో విజయసాయిరెడ్డిని ఏదోవిధంగా ఇబ్బంది పెట్టాలని యోచిస్తున్న తరుణంలోనే ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామాచేశారు. దీంతో ప్రత్యర్థులకు ఇక చేయాల్సిందేమీ మిగల్లేదు. ఇక పార్టీకి కూడా రాజీనామా సమర్పిస్తానని ‘ఎక్స్‌’వేదికగా తెలిపిన సంగతి తెలిసిందే. అంతేకాదు తన రాజీనామా విషయం జగన్‌కు ముందే చెప్పినట్టుకూడా ఆయన వెల్లడిరచడం తో ఈ తతంగం అంతా జగన్‌కు తెలిసే జరిగిందనుకోవాలి.

మరో కథనం ఏంటంటే 2019నుంచి జగన్‌ ప్రశాంత్‌ కిషోర్‌ నేతృత్వంలోని ఐప్యాక్‌ సంస్థను నియమించుకున్నారు. 2019లో వైఎస్సార్సీపీ 151 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాల్లో గెలిచింది. దీంతో ఆయన ఐ`ప్యాక్‌పై అపారమైన నమ్మకం పెట్టుకున్నారు. ఈసంస్థ ఇచ్చే సలహాలను సూచనలను తు.చ.తప్పకుండా పాటిస్తున్నారు. అయినప్పటికీ 2024 ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైంది. 2019లో పార్టీ అధికారంలోకి వచ్చిందంటే జగన్‌ అంతకుముందు జరిపిన పాదయాత్ర ప్రభావం బలీయంగా పనిచేసిందని పార్టీలో కిందనుంచి పైస్థాయి నాయకుల వరకు నమ్మా రు. కానీ జగన్‌ ఎందుకనో తనపై తాను విశ్వాసం వుంచుకోలేకపోయారనే చెప్పాలి. ఇదిలావుంటే, ఐ`ప్యాక్‌ క్రమంగా వైఎస్సార్సీపీ అన్ని స్థాయిల నాయకత్వాలకు నిర్దేశాలు జారీచేయడం మొదలు పెట్టడంతో క్రమంగా దిగువస్థాయినుంచి ప్రారంభమైన ఆగ్రహావేశాలు పైస్థాయికి చేరాయి.అయినప్పటికీ జగన్‌ ఐప్యాక్‌కు ఇచ్చే ప్రాధాన్యతలో ఈసుమంతైనా తగ్గలేదు. జగన్‌ నిర్ణయాల పై ఐప్యాక్‌ ప్రభావం బలీయంగా వుంటోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో కీలకపాత్ర పోషిస్తు న్న విజయసాయిరెడ్డికి, ఐప్యాక్‌కు మధ్య పొసగడంలేదనేది పార్టీలో అందరికీ తెలుసు. ఐప్యాక్‌ వ్యవహారం విజయసాయిరెడ్డి తలనొప్పిగా మారింది. ఇదే సమయంలో చెవిరెడ్డి ఆధిపత్య వైఖరి కూడా ఆయన్ను ఇబ్బంది పెట్టిందంటున్నారు. పార్టీలో చెవిరెడ్డి క్రమంగా తన ఆధిపత్యాన్ని పెంచుకుంటూ రావడం విజయసాయిరెడ్డికి నచ్చలేదన్నది బహిరంగ రహస్యమే. ఈ రెండు సమస్య లను విజయసాయిరెడ్డి జగన్‌ దృష్టికి తీసుకెళ్లినప్పుడు, సానుకూలతకంటే, సర్దుకుపోవడమే మంచిదన్న జగన్‌ ధోరణి విజయసాయిరెడ్డిని మానసికంగా దెబ్బతీసిందంటున్నారు. ఇక అప్పుడే ఆయన రాజీనామా చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. విషయం తెలిసిన జగన్‌ వారించకపోగా, మౌనంగా వుండటం విజయసాయిరెడ్డి నిష్క్రమణకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లయింది.

ఇక తాను రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్టు కూడా విజయసాయి ప్రకటించడం వైఎస్సార్సీపీకి తీవ్ర నష్టం కలిగిస్తుందని చెప్పకతప్పదు. ఒకరకంగా ఆలోచిస్తే ప్రత్యర్థి పార్టీ నాయకత్వం విజయసాయిని జగన్‌నుంచి వేరుచేయాలని చేసిన యత్నాలు ఫలించకపోయినప్పటికీ, మరో మార్గంలో తాము అనుకున్న విధంగా జరగడం వారికి ఆనందాన్ని కలిగిస్తుండవచ్చు. ప్రయత్నం ఏదైనా లక్ష్యం ఒక్కటే కదా!

ఇప్పుడు సమస్య విజయసాయిరెడ్డి నిష్క్రమణతో సమసిపోయేలా లేదు. ఆయన బాటలో మరి కొందరు కూడా రాజీనామాలు చేయవచ్చునన్న వార్తలు వస్తున్నాయి. వీరిలో ముఖ్యంగా వినిపించే పేరు అయోధ్య రామిరెడ్డి. ఈయనతో పాటు మరో రాజ్యసభ సభ్యుడు కూడా రాజీనామా యోచనలో వున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరూ విజయసాయి మార్గంలోనే రాజకీయాలనుంచి తప్పుకుంటా మని ప్రకటనలు ఇచ్చే అవకాశముందని అంటున్నారు. మరొక రాజ్యసభ సభ్యుడు కూ డా ఇదే యోచనలో వున్నట్టు చెబుతున్నారు. ఏతావాతా ముగ్గురు రాజీనామా సమర్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పుడు ఒకరిద్దరు రాజకీయ సన్యాసం తీసుకున్నా ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో ఇంకొంతమంది రాజీనామా బాట పడితే పరిస్థితేంటన్నది ప్రశ్న. రాజ్యసభలో సభ్యుల కొరతను ఎదుర్కొంటున్న బీజేపీ కాచుకు కూర్చొనివుంది. ఈవిధంగా ఖాళీ అయ్యే సీట్లను తన ఖాతాలో వేసుకోవడానికి ఆపార్టీ నాయకత్వం సహజంగానే పావులు కదుపుతుంది. బహుశా ఇదే అంశాన్ని చంద్రబాబుకు కూడా స్పష్టం చేసివుండవచ్చు. ఎందుకంటే తమ ప్రణాళికకు ఆయన అడ్డురాకుండా ముందు జాగ్రత్త చర్య అన్నమాట!
రాష్ట్రంలో బలపడుతున్నాం…కూటమిని ఎదిరిస్తామన్న ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంటున్న త రుణంలో వైఎస్సార్సీపీకి ప్రస్తుత పరిణామాలు ఆశనిపాతం వంటివేనని చెప్పక తప్పదు. అయినాఈ పరిణామాలకు మానసికంగా సిద్ధపడక తప్పదు. ఇక్కడ విజయసాయిరెడ్డి వై.ఎస్‌.కుటుం బం పట్ల నిబద్ధతను చాటుకున్నారనే చెప్పాలి. రాజకీయాలనుంచి తప్పుకున్నారు కానీ, జగన్‌ కుటుంబానికి ఆయన ద్రోహం తలపెట్టలేదు. జగన్‌ కూడా ఆయనకు రెండుసార్లు రాజ్యసభ టి క్కెట్లు ఇచ్చి గౌరవించారు. కానీ ఏడాదిన్నర కాలంగా ఏం జరిగిందో తెలియదు కానీ, విజయ సాయిరెడ్డి క్రమంగా చురుగ్గా పనిచేయడం తగ్గిపోయింది. చివరకు ఈ పరిణామానికి దారి తీ సింది.

ఇక్కడ గుర్తించాల్సిన మరో విషయం ఒకటుంది. వైఎస్సార్సీపీ మొత్తం జగన్‌ కనుసన్నల్లో నడు స్తుంది. పార్టీకి పేరు ప్రతిష్ట, అధికారం రావడం, పోవడం అన్నింటికీ కారణం ఆయనే. ఈ ప్రయాణంలో ఆయనకు ఆత్మీయులనుకున్నవారు దూరం కావచ్చు, శత్రువులనుకున్నవారు దగ్గర కావచ్చు. ఇదొక రాజకీయ అధికార పరమపద సోపానం. ఈ ప్రయాణంలో కలిసేవాళ్లు కలు స్తుంటారు, వెళ్లేవాళ్లు వెళ్లిపోతుంటారు. అందువల్ల జగన్‌కు ఈ పరిణామాలు తాత్కాలికంగా న ష్టం కలిగించవచ్చు. ప్రాథమికంగా పార్టీమొత్తం ఆయనే నడుపుతున్నందువల్ల, పుట్టిమునిగే పరిస్థితుండదు. కాక పోతే కొత్త నమ్మకస్తులను వెతుక్కోవాలి అంతే! ఇది ఏ గట్టి రాజకీయవేత్తకైనా అనుభవంలోకి వచ్చేదే. స్వయం ప్రకాశం లేనివారికి ఇబ్బంది తప్ప, ఛరిష్మా వున్న జగన్‌ వంటి నాయకులకు ఏవిధమైన అడ్డంకులు కాలేవు.

ఇక చంద్రబాబు నాయకత్వంలోని కూటమి నేతలు ఈ పరిణామాలతో సంతోషంతో పొంగిపోవచ్చు. కానీ లోకేష్‌కు ఇంకా ‘స్వయం ప్రకాశం’ రాలేదు. రాష్ట్రస్థాయి నాయకుడిగా రూపుదిద్దుకో వడానికి సమయం పడుతుంది. జగన్‌ అన్నిరకాల కష్టాలు అనుభవించి రాటుదేలిన నాయకుడి గా తయారయ్యారు. ఆవిధంగా తయారుచేసింది చంద్రబాబు, ఆయన నేతృత్వంలోని తెలుగుదే శం పార్టీ అనడం సముచితంగా వుంటుంది. లోకేశ్‌ను ఆవిధంగా ట్రైనింగ్‌ ఇచ్చి రాటుదేల్చే పరిస్థితులు లేవు. ఇప్పటికీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలంటే తండ్రి మద్దతున్నా చాలా కష్టపడాల్సిన పరిస్థితి! ఛరిష్మా నాయకుడు పవన్‌ కళ్యాణ్‌ ఎలాగూ వున్నాడు. ఆయన ఛరిష్మాను లోకేష్‌ తట్టుకోవడం కష్టం. మరో ప్రత్యర్థి జగన్‌ దిగ్గజం అడ్డుగావున్నాడు. కుచ్చిత రాజకీయాలు తాత్కాలిక ఫలితాలిస్తాయి తప్ప, శాశ్వత ఫలితాలనివ్వవు! ఇది చరిత్ర చెప్పిన సత్యం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!