
చేర్యాల నేటిధాత్రి…
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)నుండి వైదొలుగుతున్నట్లు.. సిద్దిపేట జిల్లా బిజెపి కార్యదర్శి రేకులపల్లి విజయలక్ష్మి రెడ్డి బీజేపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపింది.. అనంతరం జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో తీర్థంపుచ్చుకున్నట్లు తెలిపారు. గత కొన్ని ఏళ్లుగా బీజేపీలో ఉంటూ పలు మండలాల్లో తనదైన శైలిలో ముద్ర వేసుకున్న విజయలక్ష్మి రెడ్డి బిజెపి పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం ఆమె మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చిన చిత్తశుద్ధితో పని చేస్తానని పేర్కొన్నారు.