
Tribute to Communist Leader Vijay Shankar Jha
విజయ్ శంకర్ ఝా మృతి ప్రజా ఉద్యమాలకు తీరనిలోటు
ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్
నర్సంపేట,నేటిధాత్రి:
యంసిపిఐ(యు) మాజీ పోలిట్ బ్యూరో సభ్యుడు, పార్టీ కేంద్ర కమిటీ శాశ్వత ఆహ్వానితులు కామ్రేడ్ విజయ్ శంకర్ ఝా మృతి ప్రజా ఉద్యమాలకు,ఎంసిపిఐ(యు) పార్టీకి తీరని లోటని పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.నర్సంపేట ఓంకార్ భవన్ లోఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో రాజస్థాన్ కోటా తల్వాండిలో అమరత్వం పొందిన పార్టీ మాజీ పోలిట్ బ్యూరో సభ్యులు విజయ్ శంకర్ ఝా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.అనంతరం పార్టీ నర్సంపేట డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజాసాహెబ్ అధ్యక్షతన జరిగిన సంతాప కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దారపు రమేష్ మాట్లాడుతూ అమరజీవి విజయ్ శంకర్ ఝ కార్మిక ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తూనే రాజస్థాన్ రాష్ట్ర పార్టీ నిర్మాణంలో కామ్రేడ్ మోహన్ పునామియాతో కలిసి కీలకమైన బాధ్యతలు నిర్వహించిన గొప్ప మార్క్సిస్ట్ నాయకుడని ఉన్నారు. కామ్రేడ్ ఓంకార్ చూపిన బాటలో బూర్జువా భూస్వామ్య పెట్టుబడిదారీ శక్తులకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఐక్యత కోసం నిరంతరం పరితపించిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గోనె కుమారస్వామి, ఐక్య ప్రజానాట్యమండలి, మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శులు కన్నం వెంకన్న వంగల రాగసుద, పార్టీ రాష్ట్ర నాయకులు బాబురావు,నాగెల్లి కొమురయ్య, కనకం సంధ్య, జిల్లా నాయకులు మాలోత్ సాగర్,సుంచు జగదీశ్వర్, ముక్కెర రామస్వామి,కొత్తకొండ రాజమౌళి, కేశెట్టి సదానందం,ఐతమ్ నాగేష్, మాలోత్ మల్లికార్జున్, ప్రభాకర్,ఓదేలు దాసు కుమారస్వామి,నరసయ్యలతోపాటు తదితరులు పాల్గొన్నారు.