మహా కుంకుమార్చన

మహా కుంకుమార్చనలో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొత్త తిమ్మాపూర్ ప్రాంతంలో ఆండాలమ్మ కాలనీ నుండి బొక్కలగుట్ట వెళ్లే ప్రదేశంలో జగదంబేశ్వర ఆశ్రమ ప్రాంగణంలో జగదాంబేశ్వరి, మహా శివలింగ, రామలక్ష్మణ, సింహ వాహన గణపతి, సుబ్రహ్మణ్య అన్నపూర్ణ, దత్తాత్రేయ, వీరబ్రహ్మేంద్రస్వామి, పంచముఖ హనుమాన్, ద్వాదశ జ్యోతిర్లింగ, మల్లికార్జున స్వామి ల విగ్రహాల ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం వైభవోపేతంగా నిర్వహించారు. మహా కుంకుమార్చన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు.

11 రోజుల వేడుకల్లో భాగంగా దేవాలయాన్ని శోభాయ మానంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ… వేద పాఠశాల ఆధ్వర్యంలో విగ్రహాల ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన నిర్వహించి ప్రాంతాన్ని భక్తి పారవశ్యంతో నింపుతున్న నరేష్ శర్మ, రామేశ్వర చార్యులకు ఎల్లవేళలా సహాయం అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. వేద పాఠశాలలో విద్యార్థులకు ఎల్లవేళలా తోడుంటామని తెలిపారు. గోశాలను సైతం స్థాపించి ఆదర్శంగా నిలుస్తున్నారని, గోశాల కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. వోన్నోజుల రామేశ్వరా చార్య, వోన్నోజుల నరేష్ శర్మ ల ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో హోమం, ప్రత్యేక పూజలు చేపట్టారు.

11 రోజుల మహోత్సవానికి ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు విగ్రహ ప్రతిష్టాపనకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం వొన్నోజుల నరేష్ శర్మ మాట్లాడారు. జగదాంబేశ్వర ఆశ్రమ లక్ష్యం లోక కళ్యాణం అని, సకల స్త్రీమూర్తులందరూ నిండు సౌభాగ్యాలతో ఉండాలని, ప్రతి కుటుంబం అష్టైశ్వర్యాలతో వెలుగొందాలని, స్త్రీ ఆనందంగా ఉంటే ప్రతి కుటుంబం ఆనందంగా ఉంటుందనే భావనతో హోమాలు పూజలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, పిసిసి సెక్రటరీ పిన్నింటి రఘునాథరెడ్డి, గోపతి బానేష్, భక్తులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!