ఆర్టీసీ డిపోలో విజిలెన్స్ వారోత్సవాలు
నర్సంపేట,నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపోలో డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ ఆధ్వర్యంలో విజిలెన్స్ వారోత్సవాలు నిర్వహించారు.ఈ సందర్భంగా డిఎం మాట్లాడుతూ ఆర్టీసీలో అవకతవకలు జరగకుండా అలాగే సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.ఇం దులో భాగంగానే ఆర్టీసీలో తొలిసారిగా విజిలెన్స్ వారోత్సవాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తె లిపారు.అనంతరం ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు.ఫైర్ ఆక్సిడెంట్ జరిగినప్పుడు ఏ విదంగా మంటలు ఆర్పివేయాలో సిబ్బందికి డెమో ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిపో సెక్యూరిటీ హెడ్ వీరారెడ్డి,అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్,గ్యారేజ్ సిబ్బంది, డిపో సూపరవైజర్ లు, సెక్యూరిటీ విభాగం గోవర్ధన్,డిపో ఉద్యోగులు పాల్గొన్నారు.
