ఉక్కు మనిషి సర్దార్ 150 వ జయంతి.
పోలీసుల ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం.
చిట్యాల, నేటిదాత్రి :
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా, చిట్యాల మండలంలో స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు.ఈ సందర్భంగా, చిట్యాల ఎస్సై2 హేమలత మరియు ఎస్సై 2 ఈశ్వరయ్య కార్యక్రమ స్థలంలో యువతను ఉద్దేశించి ప్రసంగించారు. సర్దార్ పటేల్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని దేశ ఐక్యతను కాపాడాల్సిన బాధ్యత యువతపై ఉందని వారు నొక్కి చెప్పారు.
భారతదేశ సమైక్యత, సమగ్రత, మరియు భద్రత యొక్క ప్రాముఖ్యత గురించి పౌరులలో అవగాహన పెంచారు
‘ఉక్కు మనిషి’ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశం కోసం చేసిన సేవలను, ముఖ్యంగా 550కి పైగా స్వతంత్ర రాజ్యాలను భారత్‌లో విలీనం చేసి దేశాన్ని ఏకం చేయడంలో ఆయన కృషిని స్మరించుకోవడం జరిగింది
ఈ పరుగులో మండలంలోని యువత మరియు పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశ ఐక్యత, సమగ్రతకు కట్టుబడి ఉంటామని నినదించారు
