గెలుపు నాదే..ప్రజల మద్దతు నాకే.

https://epaper.netidhatri.com/

ప్రజలకు నిత్యం అందుబాటులో వుండేది నేను. కష్ట సుఖాలలో పాలు పంచుకునేది నేను. ఆపదలో ఓదార్చేది నేను. నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను. ఎన్నికలు రాగానే నేనున్నానని వచ్చే వారిని ప్రజలు ఎప్పుడూ నమ్మరు. నా ప్రజల మీద నాకు అపారమైన నమ్మకం వుంది. వారికి నేను సేవ చేస్తాననే విశ్వాసం వుంది. అందుకే ప్రజలు మళ్లీ ఆశీర్వదిస్తారంటున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు కు తన ప్రచార వివరాలు వివరించారు. అవి వారి మాటల్లోనే…
`తెలంగాణ కోసం పోరాటం చేశాను.

`వర్ధన్నపేట అభివృద్ధికి బాటలు వేశాను.

`వర్ధన్నపేట ను అన్ని రంగాలలో అభివృద్ధి చేశాను.

`అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చాను.

`నిన్న వర్ధన్నపేట, నేడు వర్ధన్నపేట.

`ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆశీస్సులతో నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేశాను.

`కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో దగ్గరుండి సేవలందించాను.

`కాంగ్రెస్‌ ను నమ్మొద్దు…మోసపోవద్దు.

`కాంగ్రెస్‌ అభ్యర్థికి నియోజకవర్గం మీద ఇప్పుడు ప్రేమ పుట్డకొచ్చిందా?

`కరోనా లాంటి సమయంలో జనం కనిపించలేదా?

`ప్రభుత్వ అధికారిగా వున్నంత కాలం నియోజకవర్గం ముఖం చూడలేదు.
`సామాజిక సేవలు నిర్వర్తించింది లేదు.

`పదవి మీద యావ తప్ప ప్రజల మీద లేదు.

`ఓడితే కాంగ్రెస్‌ అభ్యర్థి మళ్లీ కనిపించడు.

` గెలిచినా ప్రజలకు అందుబాటులో వుండడు.

`నిత్యం ప్రజలతో వుంటేది నేనే…

`వారికి సేవ చేసేది నేనే..

హైదరాబాద్‌,నేటిధాత్రి:

గెలుపు నాదే..ప్రజల మద్దతు నాకే..ఇది ఎంత ఆత్మ విశ్వాసంతో, ప్రజల మీద నాకున్న నమ్మకంతో చెబుతున్న మాట. ఎందుకుంటే నా ప్రజలు నాకు దైవుళ్లతో సమానం. వారికి నేను చేసిన సేవ, వాళ్లంటే నాకున్న అభిమానం అందరికీ తెలుసు. అందుకే నేను ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఎంతో ఆశీర్వదించి పంపిస్తున్నారు. నాకు కొండంత ధైర్యం ఇస్తున్నారు. మేమున్నామంటూ భరోసా ఇస్తున్నాను. ఎందుకంటే నిత్యం ప్రజలు అందుబాటులో వుండేది నేను. గత రెండున్నర దశాబ్దాలుగా అటు ఉద్యమ కారుడిగా, ఇటు ప్రజా ప్రతినిధిగా వారి మధ్యలోనే నా జీవితం గడుస్తోంది. నా జీవితం వారి ముందు తెరిచిన పుస్తకం. ప్రజల కష్ట సుఖాలలో పాలుపంచుకుంటున్నది నేను. వారి సంతోషాలను చూసేది నేను. వారి ఆపదలకు ఓదార్చేది నేను. నా నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను. నా నియోజకవర్గ ప్రజలకు అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందేందుకు ఎంతో కృషి చేస్తున్నాను. నేను ఎన్నికల రాగానే వచ్చ వ్యక్తిని కాదు. ఎప్పుడూ ప్రజలే.. నా జీవితంగా సేవ చేస్తున్న నాయకుడిని. అందువల్ల వర్ధన్న పేట నియోజక వర్గ ప్రజలు కేవలం రాజకీయ స్వార్ధం కోసం, అధికార యావ కోసం వచ్చిన వారిని నమ్మరు. నా ప్రజల మీద నాకు అచంచలమైన విశ్వాసం వుంది. వారికి నేనంటే కొండంత నమ్మకం వుంది. వారికి నేను మాత్రమే సేవ చేస్తానన్న భరోసా కల్పించడం జరగింది. మాటలు ఎవరైనా చెబుతారు. మాటలు చెప్పి మాయమౌతారు. కాని నా జీవితం వారి జీవితాలతో పెనవేసుకున్న పేగు బందంలాంటిది. అందుకే ప్రజలు మళ్లీ నన్ను ఆశీర్వదిస్తారన్న నమ్మకం వుంది అంటూ వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో ప్రచార వివరాలు వెల్లడిరచారు. అది వారి మాటల్లోనే పాఠకులకు…
నా జీవితం తెరిచిన పుస్తకం. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకమైన పోరాటం చేశారు.
తెలంగాణ సాధనలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆశీస్సులతో తన వంతు కర్తవ్యం నిర్వర్తించాను. ఆనాటి పరిస్ధితులు తెలంగాణ ప్రజలు తెలుసు. నిరంతరం ప్రజల్లో వున్న రోజులవి. నిరంతరం కొట్లాడిన రోజులవి. ఏదో ఒక రూపంలో ఉద్యమ స్వరూపాన్ని తెలంగాణ వాదాన్ని చూపించినకాలం. అలా నిత్యం ఉద్యమం, తెలంగాణ సమస్యలపై కూడా అలుపెరగకుండా రాజీ లేని పోరాటం చేయడం జరిగింది. తెలంగాణ సాధన తర్వాత మన ప్రాంతాన్ని దేశ గర్వించేలా అభివృద్ది చేయడం జరిగింది. దేశంలోనే నేడు తెలంగాణ నెంబర్‌ వన్‌ స్ధాయిలో నిలబెట్టడం జరిగింది. అలాగే వర్ధన్నపేటను అన్ని రకాలుగా అభివృద్ది చేయడం జరిగింది. అయితే అభివృద్ది అన్నది నిరంతర ప్రక్రియ. దానికి ఆది అంతం వుండదు. నియోజకవర్గానికి ఎంతో చేశాం. ఇంకా చేయాల్సివుంది. చేస్తాను. వర్ధన్నపేటకు మరింత గుర్తింపు తెస్తాను. నిన్న వర్ధన్న పేట ఎలా వుంది..నేడు వర్ధన్న పేట ఎలా వుందంటే ప్రజలే సమాధానం చెబుతారు. ఒకప్పుడు మంచినీటికి కటకట లాడిన వర్ధన్న పేట ఇప్పుడు సస్యశ్యామలమైంది. పంటలు లేక ఎడారిని తలపించిన ప్రాంతంలో ఇప్పుడు బంగారు పంటలు పండుతున్నాయి. మోడువారిన జీవితాలలో వెలుగులు వచ్చాయి. ఒట్టిపోయిన చెరువులకు మళ్లీ పూర్వ కళ వచ్చింది. చెదిరిపోయిన చెరువులకు మళ్లీ మంచి రోజులొచ్చాయి. చెరువు కూడా ఇప్పుడు ఊరుకు ఆదాయవనరుగా మారింది. కొన్ని కులాలకు ఆర్ధిక వనరులను సమకూర్చేకల్పతరువైంది. రైతుకు నీళ్లందిస్తోంది. పాడి పంటలను కాపాడుతోంది. ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసిఆర్‌ వల్ల తెలంగాణలోని మొత్తం 46వేల చెరువులు నిండు గంగాలాలైనవి. పల్లె సీమలకు ఆయువుపట్టుగా మారినవి.
ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆశీస్సులతో వర్ధన్నపేటను ఎంతో అభివృద్ధి చేశాను.
పదేళ్ల క్రితం వరకు దుఖం చూసిన తెలంగాణ సరిగ్గా కోలుకుంటున్న సమయంలో కరోనా కాటు కూడా పెద్ద ఉపద్రవాన్నే తెచ్చిపెట్టింది. ప్రపంచాన్ని వణికించిన కరోనాతో ప్రజలంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతకాల్సివచ్చింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రభుత్వం తరుపున చేయాల్సినంత సాయం అందించారు. ఎమ్మెల్యేగా నా ప్రజల కోసం ఎంతో చేయడం జరిగింది. రెండు సంవత్సరాల పాటు నిరంతరంగా నా ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నాను. వారికి అవసరమైన ఆరోగ్య సేవలు అందించాను. వారి జీవనం గడిచేందుకు అవసరమైన నిత్యావసర వస్తువులు అందించి వారి ఆకలి బాదలు తీర్చాను. అలా ప్రజలకు సేవచేసే బాగ్యం నాకు ఆ దేవుడు అందించాడు. వారి గుండెల్లో నా స్ధానం పదిలం చేశాడు. నా ప్రజలంటే నాకు ఎంతో ప్రాణమో ఆ సమయంలో ప్రజలు గుర్తించారు. నా నియోజకవర్గంలో ఏ ఒక్కరూ కరోనా వైద్యం అందక ప్రాణాలు కోల్పోవద్దని వారికి మెరగైన వైద్య సేవలు అందించి ప్రాణాలు నిలిచేందుకు కృషి చేశారు. వారు ఇప్పుడు ఆరోగ్యంగా వున్నారు.
కరోనా లాంటి కష్ట కాలంలో ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ ఓదార్చే ప్రయత్నం కూడా చేయలేదు.
ప్రజల దరి చేరేందుకు కూడా వారు ముందుకు రాలేదు. కరోనా కాలంలో కాంగ్రెస్‌ నాయకులు ఎక్కడున్నారో కూడా తెలియదు. ఎన్నికల రాగానే మాత్రం వచ్చి వాలుతున్నారు. వర్ధన్నపేటలో కూడా అలాంటి పరిస్థితే వుంది. వర్ధన్నపేటలో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా బరిలో వున్న వ్యక్తికి హటాత్తుగా ఎన్నికలనగానే నియోజకవర్గం గుర్తుకొచ్చింది. ఈ నియోజవర్గంలోనే తాను పుట్టిందన్నది తెలిసింది. ఇంత కాలం ఎందుకు గుర్తులేదు. ఇంత కాలం వర్ధన్న పేటు ఎందుకు గుర్తు రాలేదు. ఉన్నత ఉద్యోగం చేసిన వ్యక్తి వర్ధన్న పేట గురించి ఎన్నడూ ఆలోచించింది లేదు. కరోనా కాలం ఆయన ఎక్కడున్నాడో తెలియదు. ఆనాడు కనీసం అయ్యో నా నియోకవర్గం, నా ప్రజలు అని ఎందుకు రాలేదు. కనీసం నియోజకవర్గ ప్రజలను ఓదార్చే తీరిక కూడా లేని వ్యక్తి ఇప్పుడొచ్చి మాయ మాటలు చెబితే ప్రజలు నమ్ముతారా?
కాంగ్రెస్‌లో టిక్కెట్లు వచ్చిన వాళ్లంతా వాటిని కొనుకున్న వ్యక్తులే అన్నది తేట తెల్లమైంది.
ఆ విషయంపైనే దేశమంతా చర్చ జరగుతోంది. ప్రజలకు ఏనాడు అందుబాటలో లేనివాళ్లంతా వచ్చి వాలుతున్నారు. ఏ ఒక్క సామాజక సేవా కార్యక్రమం కూడా చేపట్టని వ్యక్తి కాంగ్రెస్‌ పేరు చెప్పుకొని వచ్చి రాజకీయం చేస్తున్నారు. కాంగ్రెస్‌ అంటేనే మోసం , దుర్మార్గం. అలాంటి పార్టీతో రాజకీయం చేసేవాళ్లు కూడా ఆ కోవకే చెందుతారు. అలాంటి వ్యక్తి చటుక్కున ఎన్నికల ముందు దిగితే ప్రజలు ఆహ్వానించరు. పదవి మీద యావ తప్ప, ప్రజల మీద ప్రేమ లేని కాంగ్రెస్‌ అభ్యర్ధిని ప్రజలు ఎలాగూ ఆదరించరు. ఓటమి తప్పదు. ఆ తర్వాత ప్రజల్లో వుంటాడన్న నమ్మకం లేదు. నిత్యం ప్రజల్లో వుండేది నేను. వారికి సేవ చేసేది నేను. అందుకే వర్ధన్న పేట ప్రజల ఆశీర్వాదం నాకే వుంటుంది. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మరు. పదేళ్ల క్రితం వరకు కాంగ్రెస్‌ పెట్టిన గోసలు ప్రజలు మర్చిపోలేదు. మర్చిపోరు కూడా…అంతెందుకు కర్నాటక మోడల్‌ పేరుతో తెలంగాణ ఎన్నికల్లో లేని పోని గొప్పలకు పోయిన కాంగ్రెస్‌పార్టీ అక్కడ కరంటు కనీసం ఐదు గంటలు కూడా ఇవ్వడం లేదన్న సంగతి తేలిపోయింది. అంటే కాంగ్రెస్‌ మాటలే పచ్చి అబద్దాలని తేలిపోయింది…తమ పథకాలనే కాపీ కొట్టి గ్యారెంటీ పేరుతో ప్రజల ముందుకొచ్చి, తెలంగాణ భూములు అమ్ముతామని ఇప్పుడే చెబుతున్న కాంగ్రెస్‌ పార్టీని అయ్యో అంటే తెలంగాణనే అమ్మేస్తుంది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ విషయంలో ఎంతో అప్రమత్తంగా వుండాల్సిన అవసరం వుంది. మాయ మాటలు చెప్పేవారిని నమ్మి, మళ్లీ చీకటి రోజులు తెచ్చుకోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!