Congress Leader Meer Jahiruddin Pledges
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం :
◆-: కాంగ్రెస్ నాయకులు మీర్ జాహిరుద్దీన్ మూర్తుజ
ప్రజాక్షేత్రంలో తృటిలో ఓటమి చెందిన గ్రామ అభివృద్ధికి పాటు పడతా నాపై విశ్వసం ఉంచి ఓటు వేసిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్,రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే, ప్రజాక్షేత్రంలో తృటిలో ఓటమి. చెందినప్పటికి హాద్నూర్ గ్రామ అభివృద్ధి కోసం అందరి సహకా రంతో ముందుకు సాగుతానని, హాద్నూర్ గ్రామ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారానే సాధ్యం అని న్యాల్కల్ మండల కాంగ్రెస్ నాయకులు మీర్ జాహిరుద్దీన్ మూర్తుజ అన్నారు. గత మూడు రోజుల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా హాద్నూ ర్ గ్రామ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి. చెందినప్పటికి ఎక్కడ నిరాశ చెందకుండా అందరి సహకారంతో గ్రామ అభివృద్ధి కోసం పాటు పడుతానని, ఎక్కడ లోపం జరిగిందో అంతర్గత సమావేశంలో తెలుసుకొని భవిషత్తులో మరింత ఉత్సా హంతో పోరాడుతానని, నాపై విశ్వసం ఉంచి ఆదరించి ఓటు వేసిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలువుతున్నానని, గ్రామ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ తనకు నమ్మిన వారి కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని అన్నారు.
