స్టేషన్ ముందు బారికేడు తొలగించిన కమలాపూర్ పోలీసులు..
నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)తమ సమస్యల పరిష్కారం కోసం.పోలీస్ స్టేషన్ కోసం వచ్చే ప్రజలు,బాధితులు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా పోలీస్ స్టేషన్ కు రావాలని కమలాపూర్ ఎస్ హెచ్ ఓ హరికృష్ణ మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ప్రజల సమస్యల పరిష్కారం కోసం,శాంతి భద్రతల పరిరక్షణకు కట్టు బడి వున్నామని,ప్రజల సమస్యలు పరిష్కారానికి,శాంతి భద్రతల పరిరక్షణకు 24 గంటల పాటు తనతో ఎస్ఐ, పోలీస్ సిబ్బంది అందుబాటులో వుంటారని, ప్రజలు నేరుగా సంప్రదించాలని కోరారు.పోలీస్ స్టేషన్ ముందు అడ్డంగా ఉన్న బారికెడ్ తొలిగించి, స్టేషన్ కు వచ్చే వారికి వున్న అడ్డంకులు తొలగించినట్లు తెలిపారు.