
నల్లా ఓదెలు ఆరోగ్యంగా తిరిగివచ్చినందుకు మొక్కుబడి తీర్చుకున్న వేటూరి సత్యనారాయణ
మందమర్రి నేటి ధాత్రి
మాజీ ప్రభుత్వ విప్, మందమర్రి నేత నల్లా ఓదెలు ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా స్వస్థలమైన మందమర్రికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఓదెలు త్వరగా కోలుకోవాలని కోరాగట్టు అంజనేయ స్వామికి మొక్కుబడి పెట్టిన వేటూరి సత్యనారాయణ తన మొక్కుబడిని నెరవేర్చుకున్నారు. ఓదెలు ఆరోగ్యంగా తిరిగి వచ్చారని తెలుసుకున్న వెంటనే, వేటూరి సత్యనారాయణ మంగళవారం రోజున కోరగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో “ఓదెన్న ” పేరిట ప్రత్యేక అర్చనలు నిర్వహించి మొక్కుబడి తీర్చుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, “మనసారా మొక్కుకున్న మొక్కుబడి తీర్చుకోవడం అనేది భక్తికి నిదర్శనం. ఓదెలు గారు శీఘ్రంగా కోలుకోవడంలో ఆంజనేయ స్వామి కరుణ ఉందని నేను నమ్ముతాను,” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వెల్టూరు సత్యనారాయణ. నారా లింగన్న. ముంజం నరసయ్య. జెర్రీగల రవి బండారు సత్యనారాయణ. . వాసాల శంకరి సంఘీ సంతోష్ ఏర్పుల రవి ఆగునూరి పోశం తుంగపిండి శంకర్. తదితరులు పాల్గొన్నారు