Vestige Mindset Training Successful in Mysore
మైసూర్ లో వెస్టీజ్ కంపెనీ మైండ్ సెట్ శిక్షణ ఏర్పాటు
విజయవంతం చేసిన మంచిర్యాల టీం
హైదరాబాద్,నేటి ధాత్రి:
మైసూర్ లో వెస్టీజ్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీ మైండ్ సెట్ శిక్షణ క్లాసులు మంగళవారం,బుధవారం రెండు రోజులుగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి వి.ఎం.సి.ఎం సుబ్బయ్య శెట్టి ముఖ్య అతిథిగా పాల్గొని వి.ఎం.సి.ఎం ఎం.ఎస్.ఆర్ తో కలసి మైండ్ సెట్ శిక్షణ క్లాసులు 300 మందికి పైగా మైసూర్ ప్రెసిడెంట్ హోటల్ లో ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వి.ఎం.సి.ఎం సుబ్బయ్య శెట్టి మాట్లాడుతూ.. మైండ్ సెట్ క్లాస్ అంటే ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించడానికి మనస్తత్వాన్ని ఎలా మార్చుకోవాలి అనే దానిపై శిక్షణ,విధివిధానాలు తెలిపారు.సుబ్బయ్య శెట్టి మాటలు విన్న చాలా మంది నిరు పేదలు వారి మైండ్ సెట్ మార్చుకొని వెస్టీజ్ కంపెనీలో నిలబడి పనిచేస్తూ వాళ్ళ జీవితాలను మార్చుకొని గొప్పగా జీవిస్తూ వారి ఆశయాలను సాధిస్తున్నారని అన్నారు.
మన జీవనశైలి విధానంలో మార్పు రావాలి
ప్రతి ఒక్క వ్యక్తి తన జీవన విధానంలో అనేక మార్పులు చోటు చేసుకున్న వారి ఆర్థిక ఇబ్బందులను,సమస్యలను నిలుదొక్కుకొని వేస్టేజ్ సిస్టం ను ఫాలో అవ్వడం వల్ల వారి లక్ష్యాన్ని చేరుకుంటారని అన్నారు.
ప్రతి పనిలో పట్టుదలతో పనిచేయాలి
మానవ జీవన విధానంలో ఏ పని చేసిన పట్టుదలతో,ఒక సంకల్పం లాగా పని చేసినప్పుడే విజయాలు చేకూర్తాయని అన్నారు.అలాగే నీతి,నిజాయితీ,ఏకాగ్రత,నిబంధనతో పనిచేస్తూ తోటి వారికి సహాయం చేస్తూ ప్రేమగా,ఆప్యాయంగా ఉంటూ విజయాలను సాధించాలని తెలిపారు.
