జాతర ఎంట్రీ లోనే భక్తుల వద్ద నిలువు దోపిడీ

# ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వాహనాల స్టాండు నిర్వావాహకులు.
# చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శి.

నర్సంపేట /వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి :

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల గ్రామం వద్ద గల శ్రీ కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతర హోలీ పండుగ రోజు ప్రారంభమైంది. కాగా ఆలయ పరిసర ప్రాంతాలలో కొమ్మాల గ్రామపంచాయతీ పలు కాంట్రాక్టర్లకు టెండర్ ద్వారా పండ్లు కేటాయించింది అయితే వాహనాల పార్కింగ్ టెండర్ దక్కించుకున్న వ్యక్తి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తుల నుండి జాతర ఎంట్రెన్స్ వద్దనే నిలువు దోపిడీ చేస్తున్నారని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు. గ్రామపంచాయతీ కేటాయించిన వాహనాల పార్కింగ్ టాక్సీ ప్రకారం సైకిల్ కు 10 రూపాయలు, టూ వీలర్ కు రూ. 20, మూడు చక్రాల వాహనాలకు 30 రూపాయలు నాలుగు చక్రాలు ఆపై పడిన వాహనాలకు రూ. 50 చొప్పున తీసుకోవాలని టెండర్ దక్కించుకున్న వ్యక్తికి ఆదేశించింది. కాగా సదరు కాంట్రాక్టర్ ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 50 రూపాయలు, నాలుగు చక్రాల కారు వాహనంతో పాటు ఆ పైబడిన వాహనాలకు 100 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని భక్తులు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాల పార్కింగ్ కోసం అధిక ధరలు వసూలు చేస్తున్న కాంట్రాక్టర్ పై సంబంధిత పంచాయతీ కార్యదర్శి వెంటనే చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో వారి టెండర్ను రద్దుచేసి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఉచితంగా పార్కింగ్ ఏర్పాటు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అధిక ధరలు వసూలు చేస్తున్న పార్కింగ్ కాంట్రాక్టర్ పై పంచాయతీ కార్యదర్శి శంకర్ రావు ను వివరణ కూడా అధికంగా డబ్బులు వాస్తు చేస్తున్న విషయం వాస్తవమే ప్రయాణికులకు ఇబ్బందులు గురి చేస్తున్న కాంట్రాక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకొని టెండర్ రద్దు చేస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *