వైభవంగా సాగుతున్న వేణుగోపాలస్వామి బ్రహ్మో త్సవాలు!!

సొంత ఖర్చులతో నిర్మించిన గ్రామ ముఖ ద్వారం ప్రారంభించిన సాన యాదిరెడ్డి!!
ఎడ్ల బండ్ల పోటీలు ప్రారంబించిన నిర్వాహకులు!!
చలివేంద్రం,మజ్జిగ పంపిణీని ప్రారంభించిన జనం కోసం స్వచ్ఛంద సామాజిక సేవా సంస్థ!!

ఎండపల్లి నేటి ధాత్రి
ఎండపల్లి మండలంలోని గుల్ల కోట గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి రథోత్సవం కార్యక్రమం సంధ్యాకాల సమయంలో జరగనుంది, గ్రామానికి ముఖద్వారం నిర్మించాలని గట్టి నిర్ణయంతో సుమారుగా 14 లక్షలతో తన తల్లి తండ్రి సాన లక్ష్మమ్మ గోపయ్య జ్ఞాప కార్థం నిర్మించినటువంటి కమాన్ ముఖ ద్వారం దాత శ్రీ సాన యాదిరెడ్డి నేడు ముఖ ద్వారం ప్రారంభించారు, సొంత ఖర్చులతో నిర్మించినటువంటి పాదయాత్ర రెడ్డి గారికి గ్రామస్తులు అభినందనలు తెలిపి కృతజ్ఞతలు తెలుపుతున్నారు అలాగే, గ్రామానికి ఎన్నో రకాల సేవలు అందిస్తున్న,నేడు వేణు గోపాల స్వామి బ్రహ్మోత్సవాలు కు విచ్చేస్తున్న భక్తులకు అన్న దాన కార్యక్రమం ఏర్పాటు చేసిన సాన యాదిరెడ్డి రెడ్డికి గ్రామస్థులు ,అభిమానులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు,వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్న భక్తులకు జనం కోసం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు లింగంపల్లి చందు , దాతల సహకారంతో గత 15 సంవత్సరాలుగా చలివెంద్రం, మరియు మజ్జిగ పంపిణీని ఉచితంగా భక్తులకు అందించడం పట్ల భక్తులు, జనం కోసం స్వచ్ఛంద సామాజిక సేవా సంస్థ కు కృతజ్ఞతలు తెలుపుతూ,సంతోషం వ్యక్తం చేస్తున్నారు,
బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఎడ్లబండ్ల పోటీలు ప్రారంభం
సుమారుగా గుల్లకోట గ్రామంలో గత 27 సంవత్సరాలుగా ఎడ్లబండి పోటీలు నిర్వహిస్తున్నారు, నేడు జరిగే ఎడ్లబండ్ల పోటీలకు చుట్టుపక్కల ప్రాంతాలు ఉండే కాకుండా, వివిధ జిల్లాల నుండి, సుమారుగా 27 మంది పాల్గొనడం జరిగింది, వీటిలో దాతల సహకారంతో బహుమతులు అందించడం జరుగుతుందని నిర్వహకులు తెలిపారు, మొదటి బహుమతిగా పావూ తులం బంగారం దాత సింహాచలం జగన్, ద్వితీయ బహుమతి 10 తులాల వెండి దాతలు భూసారపు రవి, గొల్లపల్లి శంకరయ్య, తృతీయ బహుమతి 5 తులాల వెండి దాత దావుల లింగయ్య కుటుంబ సభ్యులు దాతలు గా నిలిచారు.అలాగే గత కొన్ని సంవత్సరాలుగా కనీవినీ ఎరగని రీతిలో ఈ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు జరగడం ,ఎంతో మంది భక్తులు పాల్గొనడం ,పలువురిని ఆకట్టుకుంది, ఎడ్ల బండ్ల పోటీల విజేతల మొదటి బహుమతిగాపొట్లపల్లి సాగర్ అచ్చలాపూరు రెండవ బహుమతిగా
పెంచాల లక్ష్మణ్ పొన్నారం తృతీయ బహుమతి గా
పొన్నం రిత్విక్ విజేతలుగా నిలిచారు ,ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సాన మారుతి,ఉపాధ్యక్షులు గుండ గంగయ్య కోశాధికారి రేణిగుంట శ్రీనివాస్,ప్రచార కార్యదర్శి బుర్ర సాయి కుమార్,మరియు తాజా మాజీ సర్పంచ్ పొన్నం స్వరూప తిరుపతి,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బిసగోని సత్యం, గౌడ్,భక్తులు ,గ్రామ ప్రజలు.పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!