*పంచవటి సరస్వతి దేవస్థానంలో శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం*
*జహీరాబాద్ నేటి ధాత్రి:*
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ న్యాల్కల్ మండలంలోని పంచవటి సరస్వతి దేవస్థానంలో జనవరి 23 నుండి 25, 2026 వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరగనుంది.
జనవరి 24న స్వామివారి కళ్యాణం, 25న రథసప్తమి సందర్భంగా రథోత్సవం నిర్వహిస్తారు. 63 గ్రామాలకు పైగా బోనాల ఊరేగింపు, పల్లకీ సేవ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శన కృప పొందాలని కోరడం జరిగింది.
