
చందుర్తి, నేటిదాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా అర్చక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పనిచేసే కందాలై వెంకటరమణ చారి సోమవారం రోజున ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వెంకటరమణ చారి మాట్లాడుతూ ఈ అవకాశం నాకు కల్పించిన జిల్లా మరియు రాష్ట్ర అర్చక సంఘం అధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మరింత పనిచేస్తూ అర్చక సంఘాన్ని ముందుకు తీసుకువెళ్లడమే నా ఉద్దేశమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో అన్ని మండలాల గ్రామాల అర్చక సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు