
#5000 మంది బంజారాలతో ఆత్మీయ సమ్మేళనం
వెంకటాపూర్, నేటిధాత్రి:
ములుగు నియోజకవర్గం వెంకటాపూర్ మండల కేంద్రంలో జరిగిన బంజారా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేయగా ముఖ్య అతిధులుగా మూడు మండలాల ఎన్నికల ఇంచార్జ్ సాంబారి సమ్మారావు, గ్రంథాలయ చైర్మన్ గోవింద్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సమ్మరావు మాట్లాడుతూ సాగునీరు, త్రాగునీరు, సంక్షేమ రంగాలను సమానంగా అభివృద్ధి చేసిన ఘనత సీఎం కెసిఆర్ గారిదని పాత పథకాలను కొనసాగిస్తూనే కొత్త కీలక పథకాలను కేసిఆర్ మేనిఫెస్టోలో ప్రకటించారని అన్నారు. ములుగు నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేశారని ములుగు జిల్లాగా ప్రకటించారని మల్లంపల్లి మండలంగా, ఏటూర్ నాగారంను ఆర్డిఓ కార్యాలయంగా చేసి నూతనంగా ఫైర్ స్టేషన్ మంజూరు చేసిన సీఎం కేసీఆర్ గారిని కొనియాడారు. ఇంకా అనేక అభివృద్ధి పనులు కొనసాగింపులో ఉన్నాయని పదేళ్లకు ముందు ములుగుకు ఇప్పటి ములుగుకు వ్యత్యాసం మన అనుభవంలో ఉందన్నారు. జిల్లా గ్రంధాలయ అధ్యక్షులు గోవింద్ నాయక్ మాట్లాడుతూ తండాలను గ్రామపంచాయతీలు చేశాం, ఆరు శాతం ఉన్న రిజర్వేషన్లు 10 శాతానికి పెంచాం, పథకాల లబ్ధిదారులంతా బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని, సీఎం కేసీఆర్ గారు ముందు చూపుతో మన తండాలో మన రాజ్యం అనే నినాదంతో తండాలను గ్రామపంచాయతీగా చేసి తండాల రూపురేఖలు మార్చారని అన్నారు. రైతులకు మూడు గంటల కరెంట్ కావాలన్న కాంగ్రెస్ కావాలా? 24 గంటల కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ కావాలా ప్రజలే తేల్చుకోవాలని అన్నారు. నాడు ఉమ్మడి పాలనలో మన పల్లెలు ఎట్లుండే నేడు కేసీఆర్ పాలనలో ఎట్లున్నాయి. ఆ కష్టాల్లో కన్నీళ్లు మళ్లీ కొని తెచ్చుకుందామా ఆలోచించండి. కారు గుర్తుకు ఓటేద్దాం మన తెలంగాణ అభివృద్ధిని కొనసాగిద్దాం. బిఆర్ఎస్ తోనే అభివృద్ధి సంక్షేమాన్ని గెలిపియండి. నిరుపేదలకు అండగా ఉంటాం ములుగు నియోజకవర్గ అభ్యర్థి మన ఇంటి ఆడబిడ్డ బడే నాగజ్యోతిని వెంకటాపూర్ మండల ప్రజానీకం అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని మీ అందరికీ చెబుతూ చేతులు జోడించి వేడుకుంటున్నానని అన్నారు. ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన బంజారా సోదరులు సోదరీమణులు బడే నాగజ్యోతిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ములుగు నియోజకవర్గంలోని వెంకటాపూర్ మండలంలో అధిక మెజార్టీ ఇచ్చి గెలిపించుకొని కెసిఆర్ గారికి కానుకగా పంపిస్తామని ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మాజీ మంత్రివర్యులు అజ్మీర చందూలాల్ తనయుడు అజ్మీర ధరమ్ సింగ్, పోమా నాయక్, రిటైర్డ్ ఆఫీసర్ దేవ్ సింగ్, మాజీ మండల అధ్యక్షులు హర్జీ నాయక్ సీనియర్ నాయకులు మల్క రమేష్, కూరెళ్ళ రామాచారి, బుర్ర సమ్మయ్య గౌడ్, మూడు వీరేష్, మూడు తిరుపతి, చంటి భద్రయ్య, ప్రసాద్ రెడ్డి, మందల శ్రీధర్ రెడ్డి, మండల సీనియర్ బంజారా నాయకులు, అన్ని గ్రామాల బంజారా ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళా సోదరీమణులు పాల్గొన్నారు.