US Forces Capture Venezuelan President Maduro — Video Shows Him at DEA Office
యూఎస్ డ్రగ్ ఏజెన్సీ ఆఫీసులో వెనిజువెలా అధ్యక్షుడు.. వీడియో..
వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భారయ సిలియా ఫ్లోర్స్ అమెరికా భద్రతా దళాల అదుపులో ఉన్నారు. మదురోకి సంబంధించి వీడియోను యూఎస్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఓ వీడియోను విడుదల చేశాయి.
న్యూయార్క్, జనవరి 4: వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ అమెరికా భద్రతా బలగాల అదుపులో ఉన్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఫోటోను ట్రంప్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా వీడియోలు కూడా విడుదల చేశారు. మదురోని వెనిజువెలా నుంచి తీసుకువచ్చి.. అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్(DEA) న్యూయార్క్ డివిజన్ కార్యాయలంలో నిర్బంధించినట్లు ఈ వీడియో ద్వారా స్పష్టమవుతోంది.
శనివారం తెల్లవారుజామున వెనిజువెలా రాజధాని కారకాస్‌పై ప్రత్యేక అమెరికా దళాలు ఆకస్మిక దాడి జరిపాయి. ఈ దాడి సమయంలోనే ఆ దేశ అధ్యక్షుడు మదురో ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. యూఎస్ సెక్యూరిటీ ఫోర్సెస్ వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, యూఎస్ దాడి సమయంలో మదురో, ఆయన భార్య కారకాస్‌లోని హై సెక్యూరిటీ ఫోర్ట్ టియునా మిలిటరీ కాంపౌండ్‌లోని తమ నివాసంలో ఉన్నట్లు తెలుస్తోంది. దాడి విషయం తెలియగానే హైసెక్యూరిటీతో పారిపోయే ప్రయత్నం చేశారు. కానీ, వారి ప్రయత్నం ఫలించలేదు.
