
Minister Konda Surekha
జననేత మంత్రి కొండా సురేఖకు శాలువా కప్పి అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
ప్రజల హృదయాలను గెలుచుకున్న జననేత అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జన్మదినం ఈనెల 19న ఉన్నందున..శనివారం హన్మకొండ రాంనగర్ లోని కొండా దంపతుల నివాసంలో మంత్రి సురేఖను బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఆమెకు అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వేముల మహేందర్ గౌడ్ మాట్లాడారు. నిస్వార్థ సేవకు నిలువెత్తు ప్రతిరూపం..ఆపదోస్తే అండగా ఉండే ఆపద్బాంధవురాలు..నిరుపేదల పక్షపాతి అయినటువంటి కొండా సురేఖ గొప్పతనాన్ని మహేందర్ గౌడ్ అభివర్ణించారు. పేద ప్రజలకు సేవ చేయడంలోనే దైవత్వం దాగి ఉందని భావించే గొప్ప మనసున్న మహా నాయకురాలని, నిరుపేద ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునే కొండా సురేఖ..వీరత్వంలో ఝాన్సీరాణిలాగా..ధీరత్వంలో ఓరుగల్లు రుద్రమదేవిలాగా..గుణంలో సీతాదేవిలాగా..రూపంలో పార్వతీ దేవిలాగా..ఓర్పులో భూమాతలాగా..శత్రువుల పాలిట కాళికాదేవిలాగా..ఓరుగల్లు ప్రజలను కాపాడే భద్రకాళి లాగా నిత్యం ప్రజల గుండెల్లో కొలువైన అమ్మవారిలాగా..జనహృదయాలను గెలుచుకున్న కొండా సురేఖ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవదేవున్ని వేడుకుంటున్నట్లు మహేందర్ గౌడ్ తెలిపారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం కలిగిన కొండా సురేఖ..నమ్ముకున్న నిరుపేద ప్రజలు, అభిమానుల కోసం ఎంతటి వారినైనా ఎదిరించే వీరత్వం కలిగిన ధీరవనిత అని కొనియాడారు. పదవుల కోసం కాకుండా..ప్రజాసేవలో నిమగ్నమయ్యే కొండా సురేఖ నమ్ముకున్న వారికోసం పదవులను సైతం త్రుణప్రాయంగా వదిలిపెట్టి..మంత్రి పదవిని సైతం లెక్కచేయకుండా..మంత్రి పదవికి రాజీనామా చేసిన దమ్మున్న నాయకురాలు కొండా సురేఖన్నారు. నమ్ముకున్న ప్రజలు అభిమానుల కష్టాలను తీర్చేందుకు..కొండా దంపతులు ఎన్నో కష్టాలను అనుభవించారన్నారు. ప్రజలకు మంచి చేయాలనే తపన తప్ప..ఎలాంటి స్వార్థం లేని నిస్వార్ధ సేవకురాలు కొండా సురేఖని, ఇలాంటి అరుదైన నాయకురాలు నేటి తరంలో ప్రపంచంలో ఎక్కడ కనుచూపు మేరలో దొరకరన్నారు. అందుకే కొండా సురేఖ-మురళీధర్ రావులది భిన్నమైన నాయకత్వమని, పార్టీలు కాదు ముఖ్యం..ప్రజాసేవ చేయడమే తన కర్తవ్యమని భావించే..అరుదైన నాయకులు కొండా దంపతులన్నారు. అందుకే పార్టీలకతీతంగా ఆ ఇంటి గడపను తట్టే లక్షలాది మంది సమస్యల పరిష్కారమే ఇందుకు నిదర్శనమన్నారు. పార్టీలు ఏవైనా..ప్రజలంతా తనవారేనని నమ్మే కొండా దంపతులు..ఎలక్షన్ల వరకే పార్టీలు..ఆ తర్వాత అభివృద్ధి అనే ఏజెండాతోనే ముందుకు సాగుతారన్నారు. వరంగల్ జిల్లా గ్రామీణ ప్రాంతంకు చెందిన ఉక్కల్ లో తుమ్మ రాధ-చంద్రమౌళి దంపతులకు జన్మించిన ఈ కోహినూర్ వజ్రం..మహిళా ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ భర్త కొండా మురళీధర్ రావు చల్లని నీడలో..ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని..ఆ దేవదేవుని ఆశీస్సులతో..ప్రజల నిండు దీవెనలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని..మంత్రిగా ప్రజలకు ఉన్నతమైన సేవలను అందిస్తూ..రాజకీయ రంగంలో మరింతగా రాణించాలని ఓరుగల్లు భద్రకాళి అమ్మవారిని వేడుకున్నట్లు మహేందర్ గౌడ్ తెలిపారు.