-పుష్ప గుచ్చాన్ని అందిస్తున్న దృశ్యం
మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్
రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖను గురువారం హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో కొండా దంపతుల వీరాభిమాని..ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్..బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇట్టి విషయమై మంత్రి కొండా సురేఖ సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.