
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మంచిర్యాలలో స్థిరపడ్డ సింగరేణి ఎంప్లాయ్ దోనికేన సమ్మయ్య గౌడ్-విజయ దంపతుల కుమారుడు దీపక్ గౌడ్ -నిశ్చల వివాహ వేడుకలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లందు ఫంక్షన్ హాల్ లో బుధవారం ఘనంగా జరిగాయి. ఈ వివాహ వేడుకలకు బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్, మొగుళ్లపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దుర్గం సురేష్ గౌడ్, మొగుళ్ళపల్లి ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు నిమ్మల భద్రయ్య, మొగుళ్లపల్లి ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మంగళపల్లి శ్రీనివాస్, రిపోర్టర్ కట్కూరి ఐలయ్యలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి..శుభాకాంక్షలు తెలిపారు.