Velichala Rajender Rao visits bereaved families in Karimnagar
బాధిత కుటుంబాలకు వెలిచాల రాజేందర్ రావు పరామర్శ
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పాత బజార్, వల్లంపహాడ్ లలో ఇరువురు బాధిత కుటుంబాలను మంగళవారం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పరామర్శించారు. వల్లంపహాడు మాజీ సర్పంచ్ సాదినేని మునిరాజ్ తల్లి లక్ష్మి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను, అనంతరం పాత బజార్లో చిరంజీవి అభిమాన సంఘం జిల్లా అధ్యక్షులు కోడూరి హరికృష్ణ గౌడ్ సోదరులు కోడూరి శైలేష్ గౌడ్ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈకార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు కొలగాని అనిల్, గుర్రం అశోక్ గౌడ్, వేల్పుల వెంకటేష్, అనంతుల రమేష్, తదితరులు పాల్గొన్నారు.
