Velichala Rajender Rao Greets CM Revanth Reddy
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వెలిచాల
కరీంనగర్, నేటిధాత్రి:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా రాజేందర్ రావు ముఖ్యమంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి, పలు అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించారు. కరీంనగర్ నియోజకవర్గంలో ఇరవై గ్రామాలు ఉండగా ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పదకోండు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఒంటి చేత్తో గ్రౌండ్లో ఉండి గెలిపించానని ముఖ్యమంత్రి కి రాజేందర్ రావు వివరించారు. సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే కరీంనగర్ రూరల్ కొత్తపెల్లి మండలాలపై ప్రత్యేక దృష్టి సాధించానని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక నుంచి వారి గెలుపు కోసం అర్ధరాత్రి వరకు ప్రచారం నిర్వహించానని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా వారికి అన్ని రకాలుగా వెన్ను దన్నుగా ఉండి పదకోండు మంది సర్పంచులను గెలిపించానని తెలిపారు. కరీంనగర్ నగరంతో పాటు కరీంనగర్ రూరల్ కొత్తపెళ్లి మండలాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి గ్రౌండ్లో ఉండి వర్క్ చేస్తున్నానని ముఖ్యమంత్రికి వివరించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం, సర్పంచుల గెలుపులో కీలక పాత్ర పోషించిన రాజేందర్రావును ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. రాజేందర్ రావు పనితీరుపై సంతోషం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో కరీంనగర్ నగర పాలక సంస్థ పై కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయడం లక్ష్యంగా పనిచేయాలని రాజేందర్ రావుకు ముఖ్యమంత్రి సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మేయర్ పీఠం దక్కించుకునేలా క్రియాశీలకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చెప్పారని రాజేందర్ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన సంవత్సరం వేళ కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు సర్పంచ్ ఎన్నికల్లో పదకోండు మందిని గెలిపించడంపై సీఎం రేవంత్ రెడ్డి వెన్నుతట్టి ప్రోత్సహించి సంతోషం వ్యక్తం చేశారని రాజేందర్ రావు పేర్కొన్నారు.
