
కొద్ది రోజుల్లోనే పోయిన సెల్ ఫోన్ అప్పగించడంతో పోలీసులకు వెల్లు వెత్తు తున్న అభినందనలు!!
ఎండపల్లి ,(జగిత్యాల) నేటి ధాత్రి తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అంది పుచ్చుకోనీ ఇటీవల పోయిన సెల్ ఫోన్ ను బాడితునికి,తొందరలోనే ట్రేస్ చేసి అప్పగించడం తో బాధితుని కళ్ళల్లో ఆనందానికి అవదుల్లేవు,అలాంటి సంఘటన మన వెల్గటూర్ మండలం లో జరిగింది ,అస్సాం రాష్టానికి చెందిన హఫీజుర్ రహమాన్ వెల్గటూర్ గ్రామంలో లోని మెగా కంపెనీ లో ఫోర్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నడు, తేదీ 26-08-23 రోజున తన యొక్క మొబైల్ ఫోన్ వన్ ప్లస్ నర్డ్ 2టి 5జి(విలువ 28.999/-) పోయినది అని వెల్గటూర్ స్టేషన్ లో పిర్యాదు ఇవ్వగా ,పోలీస్ వారు సిఇఐఆర్ అనే సాంకేతిక పరిజ్ఞానం తో ఫోన్ ట్రేస్ చేసి 10-11-23 రోజున బాధితునికి ఎస్ ఐ శ్వేత సెల్ ఫోన్ అప్పగించడం జరిగింది.వెంటనే అనతి కాలంలోనే పోయిన. సెల్ ఫోన్ అప్పగించినందుకు పోలీస్ సిబ్బంది కి బాదితుడు కృతజ్ఞతలు తెలిపారు