నర్సంపేట,నేటిధాత్రి :
తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శిగా నర్సంపేట పట్టణానికి చెందిన వెల్దండి వెంకటేశ్వర్లు నియమిస్తున్నట్లు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ తెలిపారు.ఈ సందర్భంగా వెల్దిండి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పద్మశాలీ చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న చేనేత ఐక్యవేదికకు ధన్యవాదాలు తెలిపారు.చేనేత ఐక్యవేదికలో తను ఒక భాగమైనందుకు సంతోషంగా ఉందని అన్నారు. తనపై బాధ్యత ఉంచి కార్యదర్శిగా నియమించినందుకు అధ్యక్షులు వీర మోహన్ కు కృతజ్ఞతలు తెలిపారు. సాధ్యమైనంత వరకు చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పద్మశాలి బిడ్డగా కృషి చేస్తానని అన్నారు. ఈనెల 28వ తేదీన హైదరాబాద్ ధనుంజయ గార్డెన్ లో జరిగే ప్రమాణ స్వీకార మహోత్సవానికి పద్మశాలీలు భారీగా తరలి వెళ్లాలని పిలుపునిచ్చారు.