తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో తంగళ్ళపల్లి ఎస్సై ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు చేశారు ఈ సందర్భంగా తంగళ్ళపల్లి ఎస్సై డి సుధాకర్ మాట్లాడుతూ ప్రయాణికులు ఎవరైనా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వలన ప్రమాదకు గురి అవుతారని అలాగే సీట్ బెల్ట్ లేకుండా పెద్ద వాహనాలు నడపరాదని ఆటోలో ఎక్కువ మందిని తీసుకొని వెళ్లొద్దని వాహనాలపై ఉన్న పెండింగ్ ఛానల్ వెంటనే చెల్లించాలని లేనియెడల చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ముఖ్యంగా మద్యం సేవించి వాహనం నలపకూడదని అలా ఎవరైనా నడిపితే వారిపై తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వెల్లడించారు ఇట్టి తనిఖీలలో స్థానిక ఎస్సై సుధాకర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు