చెల్పూర్ ఎంజీఎం హైస్కూల్లో వెజిటబుల్స్ డే వేడుకలు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో చెల్పూర్ గ్రామంలో స్థానిక ప్రాంతీయ శాఖాహార అభ్యాసాల యొక్క వాంఛనీయత వాటియొక్క ప్రయోజనాలను ప్రోత్సహించడానికి పాఠశాలల్లో వెజిటబుల్స్ డే నిర్వహిస్తారు అందులో భాగంగా చెల్పూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎంజీఎం హైస్కూల్ నందు కూరగాయల పోషక విలువల గురించి రైమ్స్ స్పీచ్ వెజిటబుల్ వేషధారణలు మరియు టేబుల్ పై ఉంచిన వివిధ రకాల కూరగాయల రంగు ఆకారం గుర్తింపు వంటి పలు కార్యక్రమాలు విద్యార్థులచే చేయించారు ప్రీ ప్రైమరీ టీచర్లు శాఖాహారం యొక్క ప్రాముఖ్యతను రైతుల నుండి లభించే వివిధ రకాల కూరగాయలు తినడం వల్ల రోగనిరోధక శక్తితో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎలా సహాయపడతాయో తెలుసుకోవడానికి ఇది ఫలవంతమైన రోజుగా భావించాలి అని విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ గ్యాదంగి సతీష్, పాఠశాల డైరెక్టర్లు గ్యాదంగి తిరుపతి గ్యాదంగి రమాదేవి సిలువేరు శ్రీనివాస్ ప్రిన్సిపాల్ మధుకర్ ప్రీ ప్రైమరీ టీచర్లు లక్ష్మి శ్రీలత ఝాన్సీ హీన మౌనిక శ్వేత వనజ దివ్య శ్రావణి దీప్తి ఉషశ్రీ యాకేష్ తో పాటు మిగతా ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!