
Sri Rachana Swamy led
వీరశైవ లింగాయతులు పాదయాత్రలో సమాజ సేవకు కొత్త అడుగు
జహీరాబాద్ నేటి ధాత్రి:
విశ్వ శాంతికై వీర శైవుల పాదయాత్ర జిల్లాఉపాధ్యక్షులు ఆగూర్ శివరాజు జహీరాబాద్, విశ్వశాంతి కై తాలూకా వీరశైవ లింగాయత్ సమాజంతో పాటు శ్రీ రాచన్న స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో జహీరాబాద్ నుండి బడంపేట్ మహా పాదయాత్ర ఈ నెల 17న ఆదివారం ఉదయం 7.00 గంటలకు జహీరాబాద్ శ్రీ రాచన్న స్వామి ఆలయం నుండి బయలుదేరుతుందని ఆ సమాజ్ జిల్లా ఉపాధ్యక్షులు ఆగూర్ శివరాజ్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం చేపడుతున్న ఈ మహా పాదయాత్ర కార్యక్రమానికి వీర శైవ లింగాయత్ సమాజ్ సభ్యులు శివ నామ స్మరణతో సంకీర్తన చేస్తూ పాదయాత్ర లో పాల్గొంటారని తెలిపారు. పాదయాత్ర జహీరాబాద్ నుండి ప్రారంభమై శివాలయం, షేకాపూర్ మీదుగా పర్సుపల్లి నుండి బడంపేట్ కు చేరుతుందన్నారు.సభ్యులు, భక్తబృందం సాంప్రదాయ వస్త్రధారణతో ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా వీరశైవ లింగాయత్ సమాజ్ జిల్లా సలహాదారులు అనిమిశెట్టి జయప్రకాష్, తాలూకా వీరశైవ లింగాయత్ యూత్ అధ్యక్షులు శ్రీ సిద్దాపురం అరుణ్, జిల్లా వీరశైవ లింగాయత్ సమాజ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి బండి శ్రీనివాస్, రాష్ట్రీయ బసవ దాల్ పట్టణ ప్రధాన కార్యదర్శి సురేష్, అమర్ కౌలాస్ తదితరులు ఆయన వెంట ఉన్నారు.