నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు,
వీరనారి చాకలి ఐలమ్మ సేవలు మరువలేని అని మడేలేయ దేవాలయం కమిటీ చైర్మన్ భూతరాజు దశరథ అన్నారు. మంగళవారం ఆమె 39 వా వర్ధంతి సందర్భంగా చండూరు చాకలి ఐలమ్మ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ పట్టణంలో స్థానిక సాయి దుర్గ కాంప్లెక్స్ లో ఆయన ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చూపిన తెగువ తరతరాలకు స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. ఆరోజుల్లోనే దొరల పెత్తనాన్ని ధిక్కరించిన బహుజన ధీర వనితగా ఐలమ్మ అనేక ప్రజా పోరాటాలకు స్ఫూర్తినిచ్చారని గుర్తుచేశారు. చాకలి ఐలమ్మ ఆదర్శాలను ప్రతి ఒక్కరు పాటించాలన్నారు.
ఈ కార్యక్రమంలో భూతరాజు దేవయ్య సంగెపు మల్లేష్, భూతరాజు వెంకన్న,పాండు, అయితా రాజు మల్లేష్, శంకర్, భూతరాజు సత్తయ్య, నాగిళ్ల బిక్షం, సంగెపు వెంకటేష్, భూతరాజు నరేష్, భూతరాజు అంజయ్య,తదితరులు పాల్గొన్నారు.