– ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
వీణవంక, (కరీంనగర్ జిల్లా)
నేటి ధాత్రి: హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ముందుగల రోడ్డును త్వరగా పూర్తి చేస్తామని దీనితోపాటు సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తన్న సమయంలో అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేస్తామని హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సోమవారం వీణవంకలోని రోడ్డు పనులను అధికారులతో పరిశీలించిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రజలు ఎవరు అధైర్యపడవద్దని తాను ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారమే ఒక్కొక్కటిగా అన్ని పనులు నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా వీణవంక రోడ్డును మొదటగా పూర్తి చేస్తానని ఇప్పటికే అధికారులతో పాటు ఎస్సారెస్పీ అధికారులతో కూడా మాట్లాడాలని వెంటనే రోడ్డు పూర్తి చేస్తామని అన్నారు. సమ్మక్క సారలమ్మ జాతర కోసం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించి జాతరకు ఎలాంటి ఆటంకాలు కలుగకుడ చూసుకుంటానని అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి ,రెడ్డిపల్లి సర్పంచ్ పోతుల నర్సయ్య ఉప సర్పంచ్ భానుచందర్,గ్రామ శాఖ అధ్యక్షులు తాళ్లపల్లి మహేష్, హోరం మధు, కొండల్ రెడ్డి,ఎం.డి యాసిన్, అధికారులు ఎమ్మార్వో ,ఎంపీడీఓ , ఎస్సై, ఆర్& బి ,మిషన్ భగీరథ పంచాయితీ రాజ్ అధికారులు పాల్గొన్నారు.