బాలాజీ విద్యాసంస్థల్లో ఘనంగా వసంత పంచమి వేడుకలు
నర్సంపేట,నేటిధాత్రి:
బాలాజీ విద్యాసంస్థల్లో ఒకటైన బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ పాఠశాల,అక్షర పాఠశాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలు నిర్వహించారు.బాలాజీ విద్యాసంస్థల్లో నెలకొని ఉన్న శ్రీ సరస్వతిదేవి ఆలయంలో ఘనంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు.ఈ వేడుకలలో బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ రాజేంద్రప్రసాద్ రెడ్డి, ట్రెజరర్ డాక్టర్ వనజ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్
వనజ సరస్వతిదేవి యొక్క విశిష్టతను తెలియజేశారు.సకల విద్యా స్వరూపిణి సరస్వతిదేవి అని ఆమె కృపా కటాక్షములు మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేసి ఓంకారాన్ని దిద్దించారు. విద్యార్థులందరూ పుస్తకాలను ,కళములను అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజించారు.
ఈ కార్యక్రమంలో విద్యాలయాల ప్రధానోపాధ్యాయులు జ్యోతి గౌడ్,భవాని,ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
