వసంత పంచమి… శ్రీ సరస్వతీ మాత పూజా అభిషేకం
చిన్నారులకు సామూహిక అక్షరభ్యాసం
కేసముద్రం/ నేటి ధాత్రి
సమత ఇంటిగ్రేటెడ్ ప్లేవె స్కూల్ నందు వసంత పంచమి పునరస్కరించుకొని శ్రీ సరస్వతి మాత పూజ అభిషేకం మరియు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరామయ్య ఆచార్యులు ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమాలు మరియు చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాన్ని నిర్వహించడం జరిగింది. చిన్నారులు, స్కూల్ పిల్లలు సరస్వతి మాత శ్లోకాలు వల్లవేస్తూ సరస్వతి మాత గేయాలనుపాడడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బాణాల నాగరాజు మాట్లాడుతూ సరస్వతి మాత కృపా కటాక్షాలు ప్రతి ఒక్క విద్యార్థి మీద ఉండి భవిష్యత్తులో ఉన్నత శిఖరాల అధిరోహించాలని ఆకాంక్షించారు. దీంతోపాటు ఈ సంవత్సరం నర్సరీలో అడ్మిషన్ పొందే ప్రతి ఒక్క విద్యార్థికి పూర్తిగా ఉచిత విద్యను అందిస్తామని తెలపడం జరిగింది. కావున ప్రతి తల్లిదండ్రులు వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ పాఠశాల అభివృద్ధికి తోడ్పడవలసిందిగా యాజమాన్యం కోరుకుంది. ఈ కార్యక్రమంలో పండితుల కరుణాకర్ రావు,బేబీ సరోజినీ, అల్లం జ్యోతి, ముత్యాల ప్రజ్ఞ శ్రీ,, లలిత పద్మ,సిమ్రాన్ , భాగ్యలక్ష్మి మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
