
రామకృష్ణాపూర్,ఫిబ్రవరి14, నేటిధాత్రి:
రామకృష్ణాపుర్ పట్టణం లోని తవక్కల్ పాఠశాలలో వసంతపంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వసంతపంచమి సంధర్భంగా దాదాపు 50 మంది విద్యార్థులకు తవక్కల్ విద్యా సంస్థల చైర్మైన్ అబ్దుల్ అజీజ్ తన చేతులమీదుగా అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.