కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన వరికెల
నడికూడ,నేటిధాత్రి:
తెలంగాణ రైతు రక్షణ సమితి,తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు నడికూడ మండలంలోని గ్రామాలలో యాసంగి కొనుగోలు కేంద్రాలను పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ రైతుల అకౌంట్లో వెయ్యాలని కోరారు. రైతులను కొనుగోలు కేంద్రాలలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్,జిల్లా నాయకులు చోళ రామారావు మండల నాయకులు వాంకే రాజు, టింకురాల రాజు,సంతోష్ రావు తదితరులు పాల్గొన్నారు.