
Vijay Sethupathi's
పూరి జగన్నాథ్- విజయ్ సేతుపతి సినిమాకు వెరైటీ టైటిల్ ఫిక్స్..?
ఇది అస్సలు ఊహించలేదుగా అంటూ కామెంట్స్
నేటిధాత్రి:
స్టార్ డైరెక్టర్ పూరిజగన్నాథ్(Poori Jagannath) ప్రస్తుతం హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi)తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పటిలానే హీరోయిన్ ఛార్మి (Charmy)తో కలిసి ఈ సినిమాను ఆయన తెరకెక్కిస్తున్నారు. ఇక హీరోయిన్స్ బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే (Radhika Abde), టబు(Tabu)లాంటి బ్యూటీస్ నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు ‘బెగ్గర్’ (Beggar) అనే టైటిల్ అనుకుంటున్నారని ఇన్ సైడ్ టాక్ కూడా నడుస్తోంది. ఈ క్రమంలో పూరిజగన్నాథ్ ఈ చిత్రం కోసం ఇప్పుడు ఓ వెరైటీ టైటిల్ను ఖరారు చేశారని తెలుస్తుంది. వివరాలోకి వెళితే..
పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి సినిమాకు ‘భవతీ భిక్షాందేహి’ (Bhavathi Bhikshandehi) అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. అయితే సాధారణంగా పూరి సినిమాలకు ‘ఇడియట్’, ‘పోకిరి’, ‘లోఫర్’, ‘రోగ్’ ఇలా వెరైటీ టైటిల్స్ ఉంటాయన్న విషయం విదితమే. ఈ క్రమంలోనే ఇప్పుడు భవతి భిక్షాందేహి అనే టైటిల్ అనుకుంటున్నారట. ఈ న్యూస్ తెలిసి పూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతుండగా.. నెటిజన్లు ఇది అసలు ఊహించలేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.