సుమతిరెడ్డి మహిళా కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా….

అకాడమిక్ ప్రణాళికను పరిశ్రమలకు అనుగుణంగా రూపకల్పన చేసుకుని ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుచుకోవచ్చు

ఆటోనమస్ స్టేటస్ పొందిన సుమతిరెడ్డి మహిళా కళాశాల సిబ్బందిని అభినందించిన “ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి”

నేటిధాత్రి, హనుమకొండ

హనుమకొండ జిల్లా, హసన్ పర్తి మండలం, అనంతసాగర్ లో గల సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలకు, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యుజిసి) మరియు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ నుండి స్వయం ప్రతిపత్తి హోదా (అటనమస్ స్టేటస్) వచ్చినట్లు ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ.. దేశంలోని ముఖ్య నగరాలలో కలశాల లకు దీటుగా, సుమతిరెడ్డి కళాశాల విద్యార్థినిలకు కావలసిన మెలకువలు నేర్పించి, వివిధ రంగాలలో రాణించుటకు దోహదము చేస్తున్నామని, దేశ విదేశాలలో గల వివిధ ఎమ్మెల్సీ కంపెనీలలో సుమతి రెడ్డి కళాశాల విద్యార్థినిలు ఉద్యోగాలు చేస్తున్నారని, ప్రపంచంలో గల వివిధ దేశాలలో గల కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలను కలిగి ప్రతిష్టాత్మక సంస్థలలో పని చేయుటకు సిద్ధంగా ఉన్నారు అని అన్నారు. పూర్వ విద్యార్థినులు వివిధ దేశాలలో పనిచేస్తూ కళాశాల ప్రతిష్టతను నిలుపుతున్నారు అని వరదారెడ్డి తెలిపారు. స్వయం ప్రతిపత్తి హోదా వలన కళాశాలకు అకాడమిక్ మెరుగుదల సాంకేతిక అభివృద్ధి కళాశాల అభ్యున్నతికి దోహదపడతాయి అని అన్నారు. స్వయం ప్రతిపత్తి హోదా వలన కలుగు వివిధ లాభాలలో అకాడమిక్ ప్రణాళికను పరిశ్రమలకు అనుగుణంగా రూపకల్పన చేసుకుని ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుచుకోవచ్చునని అన్నారు. విద్యా విధానాలను నాణ్యతతో ప్రతిష్టాత్మకంగా నిర్మించుకోవడానికి అనుమతి ఉంటుందని తెలిపారు. ఈ హోదా వలన కళాశాల హోదా పెరిగి, మంచి గుర్తింపు రావడంతో పాటు, విద్యార్థినులకు మెరుగైన అవకాశాలు రావడానికి దోహదపడుతుందని వరదారెడ్డి తెలిపారు. సుమతీరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల తన పాఠ్యప్రణాళిక రూపకల్పన, మూల్యాంకన ప్రమాణాలు ఏర్పరచుకోవడం వలన, పరిశ్రమలకు సంబంధించిన నైపుణ్యం గల ప్రణాళికను పొందుపరచుకోవడం వలన, ప్రపంచంలో గల అన్ని రంగాలలో అవకాశాలను మరింత మెరుగుపరచుకొని ఉద్యోగ అవకాశాలు నిండుగా ఉంటాయని తెలిపారు.

సుమతిరెడ్డి మహిళా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఐ. రాజశ్రీ రెడ్డి మాట్లాడుతూ…

ఈ స్వయం ప్రతిపత్తి హోదా వలన విద్యార్థినులకు మరింత వ్యక్తిగత అభివృద్ధికి దోహదపడుతుంది అని, కంపెనీలకు సంబంధించిన వివిధ పాఠ్యాంశాలను పొందుపరిచి విద్యార్థినులలో గల సృజనాత్మకతను వెలికి తీసి వారిని ప్రపంచ స్థాయిలో ఉద్యోగ మరియు వ్యాపారవేత్తలుగా నిలుపుటకు నిరంతరం కృషి చేస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఐ రాజశ్రీ రెడ్డి తెలిపారు. ఈ ఆటోనామస్ హోదా అనేది కళాశాల యొక్క కీర్తిని మరింత పెంచేందుకు దోహదపడుతుందని విద్యార్థినులు నూతన ఆవిష్కరణలు చేయుటకు కావలసిన అంశాలను పాఠ్య ప్రణాళికలో పొందుపరచుకోవడం జరుగుతుందని తెలిపారు. సుమతీ రెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినిలను ఉత్తేజం చేస్తూ, కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాము. మహిళలను అన్ని రంగాలలో శక్తివంతం చేసేందుకు, వారి అభ్యున్నతికి అంకితభావంతో పనిచేస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నామని ప్రిన్సిపల్ తెలిపారు.

సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఆటోనమస్ స్టేటస్ పొందినందుకు, కలశాలలోని వివిధ విభాగాంధీపతులు డాక్టర్ ఈ సుదర్శన్, డాక్టర్ కే మహేందర్, డాక్టర్ ఎన్ శ్రీవాణి, ఏవో వేణు గోపాలస్వామి, అధ్యాపక బృందం విద్యార్థినులకు మరియు తల్లిదండ్రులకు తమ హృదయపూర్వక అభినందనలు తెలిపారు యాజమాన్యం. ఈ సందర్భంగా ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి, కార్యదర్శి ఎం మధుకర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఐ రాజశ్రీ రెడ్డి ఈ అత్యున్నత విజయానికి కారణమైన కళాశాల సిబ్బంది యొక్క, అంకిత భావాన్ని వారు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!