
వనపర్తి నేటిధాత్రి:
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిని రాష్ట్రంలో రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై వనపర్తి రేషన్ డీలర్లు కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు బచ్చురాం మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో రేషన్ డీలర్లకు ప్రతి నెల గౌరవ వేతనంగా 5000 రూపాయలు క్వింటాలుకు 300 కమిషన్ ప్రజలకు రేషన్ షాపుల ద్వారా 9 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వ గోదాం నుండి రేషన్ షాపుల కు బియ్యం బస్తాలు తూకం తక్కువగా వస్తున్నాయని బియ్యం తక్కువగా రావడం వల్ల రేషన్ డీలర్లు నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ తూకమున్న బియ్యం బస్తాలను ప్రభుత్వం వాపస్ తీసుకోవాలని ఆయన ఎమ్మెల్యేను కోరారు . లారీ డ్రైవర్లు ప్రభుత్వ పిడిఎఫ్ బియ్యం రేషన్ షాపులకు అన్లోడింగ్ చేసిన తర్వాత అదనంగా డబ్బులు ఇవ్వాలని హమాలీలు దౌర్జన్యం చేస్తున్నారని వారిని కట్టడి చేయాలని ఆయన కోరారు. డీలర్లు ఆకస్మికంగా మరణించి కుటుంబానికి 20 000 ఆర్థిక సహాయం దహన సo స్కారాల కొరకుఇన్సూరెన్సు ద్వారా 10000డీలర్ల కుటుం బాలకు ఇవ్వాలని కోరారు .ఎమ్మెల్యే ని కలిసిన వారిలో వనపర్తి రేషన్ డీలర్లు రాఘవేంద్ర గోపి ఆనంద్ మన్యం జనార్దన్ గౌడ్ తదితరులు ఉన్నారు