
వనపర్తి నేటిదాత్రి;
ఆర్బిఐ ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు 2024లో భాగంగా వనపర్తి జిల్లా ఎస్పీ *శ్రీమతి రక్షిత కె మూర్తి, ఆదేశానుసారంతో వనపర్తి జిల్లా సైబర్ క్రైమ్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మరియు వనపర్తి యూనియన్ బ్యాంక్ మేనేజర్ మరియు సిబ్బంది వారితో వనపర్తి మహిళా డిగ్రీ కళాశాలలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినారు. మొదటగా సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కొత్త ట్రెండ్ల సైబర్ నేరాల గురించి వివరించారు.
పెట్టుబడి మోసాలు
ఆన్లైన్ జాబ్ మోసం, లోన్ యాప్ మోసాలు, క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్‌ల మోసాలు మరియు ఆధార్ బయోమెట్రిక్ మోసాల గురించి వివరించారు.
తరువాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ శ్రీ శేఖర్ రెడీ మాట్లాడుతూ భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బిఐ 2016 నుండి ప్రతి సంవత్సరము ఆర్థిక అక్షరాస్యత వారాన్ని ఎఫ్ ఎల్ డబ్ల్యు ను పాటిస్తూ బాధ్యతయుతమైన ఆర్థిక ప్రవర్తనలో నిమగ్నం అవ్వడానికి మరియు సమాచారంతో కూడిన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రజలకు ఆర్థిక విద్య సందేహాలు విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఈ సంవత్సరం ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల థీమ్ ను 2024 ఫిబ్రవరి 26 నుండి మార్చి ఒకటి వరకు ఆర్థికంగా స్మార్ట్ అవ్వండి సేవింగ్ అండ్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ విద్యార్థుల కోసం బ్యాంకింగ్ ఎసెన్షియల్ మరియు డిజిటల్ మరియు సైబర్ హైజిన్ పై ప్రాధాన్యత ఇస్తూ ఇది నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ యొక్క మొత్తం వ్యూహాత్మక లక్షాలకు అనుగుణంగా ఉంటుంది. చిన్నప్పటినుండి క్రమశిక్షణ అలవర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన పెంచుకోవడమే విద్యార్థుల ముఖ్య లక్షణం.
ఇది గ్రాడ్యుయేట్ విద్యార్థుల నుండి విన్నుత ఆలోచనలను కోరడం యువతలో ఆర్థిక అక్షరాస్యతను ప్రచారం చేయడానికి సృజనాత్మక వ్యూహాలపై ఉద్దేశించబడింది బాధ్యతాయుతమైన ఆర్థిక ప్రవర్తన మరియు సమాచారంతో కూడిన ఆర్థిక నిర్ణయాలు తీసుకోండి అని యూనియన్ బ్యాంక్ మేనేజర్ గారు విద్యార్థినిలకు వివరించారు.
ఇట్టి కార్యక్రమంలో వనపర్తి జిల్లా సైబర్ క్రైమ్ ఇనిస్పెక్టర్ శ్రీనివాస్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ శేఖర్ రెడ్డి గ వనపర్తి టౌన్ ఎస్ఐ జయన్న
దాదాపు 130 మంది విద్యార్థులు, కళాశాల సిబ్బంది, లీడ్ బ్యాంక్ అధికారులు, స్థానిక పోలీసు సిబ్బంది, సైబర్ యోధులు పాల్గొన్నారు