
School
నారాయణ హై స్కూల్ లో వనమహోత్సవ కార్యక్రమం
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల నారాయణ హై స్కూల్ లో వనమహోత్సవ కార్యక్రమం బుధవారం నిర్వహించరు.పాఠశాల విద్యార్థులు వివిధ రకాల మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కరీంనగర్ జోన్ ఏజీఎం చైతన్య రావు హాజరయ్యారు. చైతన్య రావు మాట్లాడుతూ విద్యార్థులకు చెట్లు నాటడం వల్ల కలిగే ఉపయోగాల గురించి వివరించారు. అదేవిధంగా పాఠశాల ప్రిన్సిపాల్ కవిత మాదిశెట్టి వనమహోత్సవం యొక్క ఉద్దేశాన్ని వాటి ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించి పర్యావరణానికి సంబంధించిన వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జోనల్ అనలిస్ట్ రాజేందర్,ఏవో సంజీవ్,వైస్ ప్రిన్సిపాల్ సంధ్యారాణి, ఆక్టివేట్ ఇంచార్జ్ జ్యోతి గోపతి ఇతర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.