Vanadeva Tala Jathara Committee Election Held
వనదేవ తల జాతర ఉత్సవ నూతన కమిటీ ఎన్నికఅధ్యక్షులుగా ఆలూరి గంగాధర్ రావుప్రధాన కార్యదర్శి చదువు అన్నా రెడ్డి.
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మండలంలోని ములకలపల్లి మొగుళ్లపల్లిలో. 28 నుండి 31వరకు రెండు గ్రామాల మధ్య జరగనున్న మినీ మేడారం జాతర ఉత్సవాలను నిర్వహించేందుకు మొగుళ్ళపల్లి సర్పంచ్ చాట్ల విజయ రవీందర్, ములకలపల్లి సర్పంచ్ గాదం శ్రీవాణి రమేష్, ఆధ్వర్యంలో. మినీ మేడారం జాతర ఉత్సవ కమిటీని ఎన్నుకోవడం అధ్యక్షులుగా ఆలూరి గంగాధర్ రావు, ప్రధాన కార్యదర్శి. చదువు అన్నారెడ్డి ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ. ఆలయ ప్రాంగణంలో గద్దెల పైకి 28న శ్రీ సారలమ్మ, 29న శ్రీ సమ్మక్క తల్లులు గద్దెకు రావడం జరుగుతుందని 30వ శుక్రవారం నాడు భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందని. రెండు వాగుల మధ్యన ఆహ్లాదకరమైన వాతావరణంలో కోయ రాజుల సాంప్రదాయ రిత్యా శాస్త్ర యుక్తంగా బ్రహ్మాండంగా ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని. ఈనెల 17న శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు వివిధ రకాల షాపులను నిర్వహించేందుకు వేలంపాటను నిర్వహించడం జరుగుతుందని. నిర్వాహకులు వేలం పాటలో పాల్గొనాల్సిందిగా ఉత్సవ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా ఆలూరి గంగాధర్ రావు, ప్రధాన కార్యదర్శిగా చదువు అన్నారెడ్డి, ఉపాధ్యక్షులు బుర్ర సదయ్య, బండారి భద్రయ్య, దండ బోయిన రాజీరు దేవుని బొంద్యాలు, చదువు దశరథ్ రెడ్డి మల్సాని నరసింగారావు, బండారి రామస్వామి వేముల మహేందర్ గౌడ్, నల్లబీం మల్లయ్య, వనపాకల బాబు, నీల రాజు, బండారి శ్రీనివాస్, గొల్ల సాంబమూర్తి, కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు
