టీపీసీసీ కో ఆర్డినేటర్ దారా భాస్కర్.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుండి కాంగ్రేస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేయబోతున్న డా. వంశీచంద్ రెడ్డి ని బారి మెజారిటీతో గెలుస్తారని టీపీసీసీ కో ఆర్డినేటర్ దారా భాస్కర్ ధీమా వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాల నుండి దేశాన్ని , తెలంగాణా రాష్ట్రాన్ని దోచుకొని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి , కార్పొరేట్ వ్యక్తులకు తొత్తులుగా మారిన బీజేపీ , బి ఆర్ ఎస్ పార్టీలకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు అని అభిప్రాయం పడ్డారు. కాంగ్రేస్ పార్టీ మిగులు బడ్జెట్ తో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కల్వకుంట్ల కుటుంబం ప్రజా ధనాన్ని దోచుకొని రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. అదే విదంగా పేద ప్రజల , ఎస్సి ,ఎస్టీ లా భూములు లాక్కొని ఏ ఆధారం లేకుండా చేసిన బి ఆర్ ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ది చెప్పినట్టు , ఎంపీ ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రజలు ఒక్క సీటు కూడా గెల్పించకుండా తగిన రీతిలో బుద్ది చెప్తారని అన్నారు