Vajrotsava Mahasabha on the 75th birth anniversary of Sri Sri Sri Bharathi Tirtha Swami
శ్రీశ్రీశ్రీ భారతి తీర్థ స్వామి వారి 75వ జన్మదిన వజ్రోత్సవ మహాసభలు,
తిరుపతి(నేటి ధాత్రి) ఏప్రిల్ 03:
శ్రీశ్రీశ్రీ భారతి తీర్థ స్వామి వారి 75వ జన్మదిన సందర్భంగా వజ్రోత్సవ మహాసభలు, తిరుపతి శృంగేరి శంకర మఠంలో నిర్వహించారు.
శ్రీ అన్నపూర్ణ సమేత కాశి విశ్వేశ్వర శారదాంబ గుడిలో విశేష పూజా కార్యక్రమాలు అలాగే రాముల వారి గుడి ఉత్తరమాడవీధిలోని శంకరమఠంలో ఆది శంకరాచార్యుల వారికి అభిషేకం, విశేష పూజలు నిర్వహించారు.
సాయంత్రం లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, సౌందర్య లహరి పారాయణ సుమారు 70 మంది ముత్తైదువులతో ఈ పారాయణ జరిగింది.
ప్రముఖ ప్రవచనకర్త కుప్ప విశ్వనాథ శాస్త్రి ఆధ్వర్యంలో వేద శాస్త్ర పండితుల సభలు నిర్వహించినారు.
శ్రీ శాస్త్రి ఈరోజు ఆదిశంకరాచార్య గురు పరంపర గురించి శృంగేరి శంకరమఠ భారతి తీర్థ స్వామి, విధు శేఖర భారతి స్వామి వార్ల గురించి విశేషంగా ప్రవచనం అందించారు.
ఈరోజు విశేషంగా శ్రీ భారతీయ తీర్థ స్వామి వారి కృపతో గండ్రకోట లక్ష్మీ మనోహర్ ఈ తిరుపతి శంకర మఠం శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలను స్వీకరించారు.
ఈ కార్యక్రమం మొత్తం ధర్మాధికారి రాళ్లపల్లి రామమూర్తి ఆధ్వర్యంలో జరిగింది.
తిరుపతి శంకర మఠం మేనేజర్ నడింపల్లి కృష్ణ పూర్ణచంద్ర, సురభి మురళి పాల్గొన్నారు.
