మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ.
మహబూబ్ నగర్/ నేటి ధాత్రి
మహబూబ్‌నగర్ బీజేపీ జిల్లా కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. జిల్లా బీజేపీ ముఖ్య నాయకులతో కలిసి వాజ్ పేయి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వాజ్ పేయి శతజయంతి వేడుకల్లో భాగంగా.. సమదీపని ఆవాస ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. భరతజాతి గర్వించదగిన నేత, రాజనీతిజ్ఞుడు మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి అన్నారు. దేశ అభ్యన్నతికి వాజ్ పేయి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన దూరదృష్టితో తీసుకొచ్చిన సంస్కరణలే దేశ ప్రగతికి పునాదులుగా ఉన్నాయని గుర్తు చేశారు. ఆయన స్పూర్తితో ప్రధాని మోదీ పాలనలో ఈ దేశం ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.