శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండల కేంద్రం లోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాలు చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాల యంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాట్లు వైభవంగా నిర్వహించినారు ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమా చారి ప్రత్యేక పూజలు చేసి నారు. దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి మాట్లా డుతూ నెలకు రెండు చొప్పున 24 ఏకాదశిలు వస్తాయని అందులో అత్యంత ముఖ్య మైనది వైకుంఠ ఏకాదశి అని ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశిలతో సమానమని అందుకోసమే ఈ పర్వదినాన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారని అన్నారు మహా విష్ణువు గరుడ వాహనము అధిరోహించి మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి దర్శనం ఇస్తారని అని నమ్మకం ఇలాంటి విశిష్టత కలిగిన వైకుంఠ ఏకాదశి పర్వదినం భక్తులతో సందడిగా మారింది ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి వినుకొండ శంకరాచారి బత్తుల రమేష్ గట్టు సురేష్ మామిడి రాజు కుసుమ వెంకటకృష్ణ గట్టు కిషన్, మార్త సుమన్, కందగట్ల రమేష్, లోకల బోయిన కుమారస్వామి, బాసని బాలకృష్ణ, కోమటి రవి కమల్, గోరంట్ల ప్రశాంత్ మార్త సుభాష్ మాధవ చంటి భక్తుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.