
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత..
రామాయంపేట నేటి ధాత్రి
రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామ నివాసి నిరుపేద కుటుంబానికి చెందిన వగ్గు లక్ష్మీనారాయణ అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయం విషయం గ్రామ బి ఆర్ ఎస్ కార్యకర్తలనుండి తెలుసుకున్న బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి వారి కుటుంబానికి రూ. 5000 రూపాయల ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ అధ్యక్షులు చిట్టిమల్లి నరేందర్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు తాటిపల్లి రాంకీ, శ్రీకాంత్ సాగర్, శ్రవణ్ గౌడ్, పాపయ్యగారి నరసింహులు, వగ్గు కృష్ణ, బబ్లూ శ్రీకాంత్, వగ్గు రమేష్ రఘుపతి సాగర్, పవన్ సాగర్, కిశోర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.