నేటిధాత్రి, వరంగల్
వరంగల్ జిల్లా అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం ఈనెల 30వ తేదీ శనివారం నాడు పైడిపల్లిలోని నలంద పాఠశాలలో నిర్వహిస్తున్నట్టు వడుప్స అధ్యక్ష కార్యదర్శులు బొల్లం కనకయ్య, జన్ను విలియమ్స్, కోశాధికారి బలవారి సుధీర్ లు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సమావేశంలో ప్రైవేట్ పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకై రాబోవు కాలంలో విద్యార్థులకు మంచి విద్యను అందించేందుకు సాంకేతికత సాధించి, ముందుకు సాగేందుకు ప్రభుత్వముతో చర్చించి, ప్రైవేట్ పాఠశాలల యొక్క సమస్యల పరిష్కారానికి ఈ యొక్క సమావేశం నిర్వహిస్తున్నట్లు వడుప్సాలోని బాధ్యులు అందరూ సకాలంలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ లకు గౌరవ సన్మానంతో పాటు మెంబర్ షిప్ సర్టిఫికెట్స్ ప్రదానం చేయడం జరుగుతుందని, ఇన్సూరెన్స్, వెల్ఫేర్ ఫండ్, ట్రస్మా, వడుప్స రాష్ట్ర బాధ్యులచే సభ్యులకు ప్రకటిస్తారని, రాబోవు విద్యా సంవత్సరం (2024-25) యొక్క క్యాలెండర్ కూడా ప్రకటిస్తున్నామనీ, ట్రస్మ, వడుప్స బాధ్యులు వారి అనుభవాలు పంచుకుంటారని నిర్వాహకులు తెలిపారు.