ఉత్తంకుమార్ రెడ్డి కమిటీ రద్దు చేయాలి

ఎస్సీ ఎస్ టి వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ డిమాండ్?

మంత్రుల కమిటీ తోమాలలకు అన్యాయం జరుగుతుంది?

న్యాయమూర్తి తో కమిషన్ వేయాలి?

నిజాంపేట్ , నేటి ధాత్రి

ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీని వెంటనే ఉప సంహరించుకోవాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి డిమాండ్ చేస్తోంది. ఈ సందర్భంగా నిజం పేట మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో జాతీయ మాల మహానాడు రాష్ట్ర పోలీసు బ్యూరో సభ్యుడు ర్యాకం శ్రీరాములు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అమలు కోసం మంత్రుల కమిటీ ఏర్పాటు చేయడాన్ని వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తోంది. ఎస్సీల అభిప్రాయాన్ని సేకరించకుండా వర్గీకరణ అమలు పేరుతో కమిటి వేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం అని సమితి భావిస్తోంది.* ఇది ఏకపక్షంగా ఉన్న ఈ మంత్రుల కమిటితో తెలంగాణ లో మాల, మాల ఉప కులాలకు ఏమాత్రం న్యాయం జరగదు. ఏ ఒక్క మాల మంత్రి లేకుండా కమిటిని ఎలా నియస్తారని ప్రశ్నిస్తున్నాము. మంత్రుల కమిటీ లోనే మాలలకు అన్యాయం జరిగింది. మంత్రుల కమిటీలో మాల మంత్రి ఎందుకు లేరని ప్రశ్నిస్తున్నాము.
ఏకంగా మంత్రుల కమిటీ లోనే మాలలకు అన్యాయం జరిగితే..ఇక ఈ కమిటీ మాల సమాజానికి ఎలా న్యాయం చేస్తుంది. అసలు మాల మంత్రి భాగస్వామ్యం లేని ఈ కమిటిని మేము స్వాగతించడం లేదు. ఒక రెడ్డి, ఒక మాదిగ, ఒక ఎస్టీ, ఒక బిసి, ఒక బ్రాహ్మణ సామాజిక వర్గాలకు చెందిన మంత్రులు ఉన్నారు కాని మాల సామాజిక వర్గం నుంచి మంత్రి కమిటీలో ఎందుకు లేరని ప్రశ్నిస్తున్నాము. ఇది మాలలకు జరిగిన అన్యాయం కాదా? కాబట్టి ఈ మంత్రుల కమిటీని స్వాగతించే ప్రసక్తే లేదు. వర్గీకరణ కోసం ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి, దగ్గరుండి కథ నడిపించిన దామోదర్ రాజనర్సింహ కమిటీలో ఉండగా మాలలకు ఎలా న్యాయం జరుగుతుంది. అసలు ప్రభుత్వం ఏకపక్షంగా వర్గీకరణ అమలు చేయాలనుకున్నప్పుడు మంత్రుల కమిటీ ఎందుకు? ఇదంతా మాలలను, *.మాల ఉప కులాలను మోసం చేయడానికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ కమిటి స్థానంలో న్యాయమూర్తి తో కమిషన్ వేయాలని డిమాండ్ చేస్తున్నాము. తెలంగాణ లో మాదిగల జనాభా కంటే మాల , మాల ఉప కులాల జనాభా ఎక్కువగా ఉంది. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటితో మాలలకు అన్యాయం జరుగుతుంది.
కాబట్టి ఈ మంత్రుల కమిటీని రద్దు చేసి సిట్టింగ్ న్యాయమూర్తి నేత్రుత్వంలో కమిషన్ వేయాలని డిమాండ్ చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీల జనాభా లెక్కలు సేకరించాలి.
రేవంత్ రెడ్డి గారు ఇలాగే మొండిగా నిర్ణయాలు తీసుకుంటే గతంలో చంద్రబాబు కు పట్టిన గతి తెలంగాణ కాంగ్రెస్ కు పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మాలమానాడు మండల అధ్యక్షులు బండారు చంద్రయ్య దుబాసి సంజీవ్ రాగుల బాబు ఎండపల్లి వినోద్ టంకరి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!