ముత్తారం :- నేటి ధాత్రి
రానున్న పార్లమెంటు ఎలక్షన్లో స్వతంత్ర అభ్యర్థిగా పెద్దపల్లి ఎంపీ గా ఊట్ల శ్రీనివాస్ పోటీ చేయబోతున్న సందర్బంగా విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీనమైన సబ్బండ జాతుల ప్రజలు నన్ను ఆశీర్వదించి పెద్దపల్లి ఎంపీ గా గెలిపించాలని నిరుపేద కుటుంబం నుండి ముందుకు వచ్చిన నన్ను వచ్చే పార్లమెంటు ఎలక్షన్లో ఎంపీ గా గెలిపిస్తే పేద ప్రజల పక్షాన నిలబడి పేద ప్రజల కోసం పార్లమెంటులో ప్రశ్నిస్తానని మీకు అందుబాటులో వుంటూ మీ పక్షాన ఉంటానని ప్రజలను కోరారు